జూనియర్ పంచాయతీ కార్యదర్శి ల సమ్మెకు సంఘీభావం!

జువ్వాడి కృష్ణ రావు !

J.SURENDER KUMAR,

ధర్మపురి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణ రావు సోమవారం సంఘీభావం తెలిపారు.

ఈ సందర్బంగా జువ్వాడి కృష్ణ రావు మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి జరిగిందంటే అది పంచాయతీ కార్యదర్శుల సహకారం వల్లనే అని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు చేసిన పనుల వలన రాష్ట్రా ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయి, కానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు జరగావలసిన న్యాయం జరగలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 లో జీవో విడుదల చేసి కార్యదర్శిలు మూడేళ్ల పాటు పనిచేస్తే, రెగ్యులేషన్ చేస్తామని చెప్పి ఒ సంవత్సరం దానిని పొడిగించిన కూడా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఒక్క మాట మాట్లాడకుండా నాలుగు సంవత్సరాలు పూర్తి చేశారని అన్నారు. అయినా కూడా ముఖ్యమంత్రి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులేషన్ చేయకపోవడం మూడు నెలల నుండి వారికి జీతభత్యాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. పల్లె ప్రగతి పథకానికి దేశ స్థాయిలో అవార్డులు వచ్చాయంటే అది పంచాయతీ కార్యదర్శులు పనితనమె అని కృష్ణారావు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులేషన్ చేసి మీ యొక్క సేవలను ఇంకా వినియోగించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ రావు అన్నారు.