కర్ణాటక అసెంబ్లీలో ఆయా సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వీరే !

J.SURENDER KUMAR,

కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కులాల లెక్కన ఎమ్మెల్యే సీట్లు పంపిణి చేశారు. ఒక్క బీజేపీ మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీం మతానికి చెందిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ముస్లీంలు, క్రిష్టియన్లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. కర్ణాటకలో 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎర్పాటు చెయ్యడానికి రంగం సిద్దం చేస్తోంది. కురబ, ఒక్కలిగ కులానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య సీఎం సీటు కోసం గట్టి పోటీ ఉండటంతో వారిలో సిద్ధరామయ్య సీఎంగా డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా కాంగ్రెస్ ఫైనల్ చేసింది.

ఇక ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 66 సీట్లకే పరిమితం అయ్యింది. కర్ణాటలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు ఒక్కొక్క కులానికి చెందిన ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీకి లింగాయత్ లు ఓటు బ్యాంక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి దళితులు, బీసీలు, ముస్లీం ఓటు బ్యాంక్ గా ఉంది. ఇక జేడీఎస్ పార్టీకి ఒక్కలిగులు ఓటు బ్యాంక్ గా ఉన్నారు. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజక వర్గాల్లో ఓటు బ్యాంక్ మొత్తం తారుమారు అయ్యింది.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అన్ని కులాలకు చెందిన నాయకులు పోటీ చేశారు. మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో కొన్ని వేల మంది ఓడిపోయారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కులానికి చెందిన వారు ఎంత మంది ఎమ్మెల్యేల వివరాలు.
కర్ణాటక అసెంబ్లీలో ఏ కులానికి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే !
👉 లింగాయత్- 56 మంది ఎమ్మెల్యేలు
👉 ఒక్కలిగ- 46 మంది ఎమ్మెల్యేలు
👉 వాల్మీకి- 18 మంది ఎమ్మెల్యేలు
👉 ఎస్సీ ( కుడి వర్గం) 14 మంది ఎమ్మెల్యేలు
👉 కురబ (సిద్దరామయ్య వర్గం )- 12 మంది ఎమ్మెల్యేలు
👉 బ్రాహ్మణ- 10 మంది ఎమ్మెల్యేలు
👉 బిల్లవ ఈడిగ- 9 మంది ఎమ్మెల్యేలు
👉 ముస్లీం- 9 మంది ఎమ్మెల్యేలు
👉 ఎస్సీ (ఎడమ వర్గం)- 9 మంది ఎమ్మెల్యేలు
👉  రెడ్డీస్ (రెడ్డి)- 7 మంది ఎమ్మెల్యేలు
👉 ఎస్సీ ( వడ్డెర)- 7 మంది ఎమ్మెల్యేలు
👉 ఎస్సీ (లంబాణి)- 6 మంది ఎమ్మెల్యేలు
👉 బంట్స్- 5 మంది ఎమ్మెల్యేలు
👉 మరాఠ (మరాఠి)- 3 మంది ఎమ్మెల్యేలు
👉 బెస్త- మూడు మంది ఎమ్మెల్యేలు
👉  జైన్- ఇద్దరు ఎమ్మెల్యేలు
👉 ఎస్సీ (మోగర), క్రిస్టియన్, రాజపుత్, యాదవ (గొల్ల), బలిజ నాయుడు, బైరాగి కులానికి
చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కర్ణాటక అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కురుబ వర్గానికి చెందిన సిద్దరామయ్య, 46 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక్కలిగ కులానికి చెందిన డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్నారు. అయితే కురబ, ఒక్కలిగ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల్లో ఉన్నారు.