కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం!

కర్ణాటక ఇంచార్జ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు!

J.SURENDER KUMAR,

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఏఐసీసీ కార్యదర్శి ఆ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కర్ణాటక ఓటర్లు పాలనలో మార్పు కోరుకుంటున్నారని, అత్యధిక స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అన్నారు.

బుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం గుల్బర్గాలోనీ బుద్ధ విహార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫామ్ హౌస్ లో జరిగిన పూజా కార్యక్రమంలో అధ్యక్షుడు ఖర్గే తో కలసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల్ డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం అధ్యక్షుడు, శ్రీనివాస్, తదితర నాయకులు శుక్రవారం గుల్బర్గా పట్టణంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.