డాక్టర్ సంజయ్ కుమార్!
J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలో 14 జోన్లు 121 సర్వే నంబర్ లను జోన్ల మార్పు చేయటం జరిగింది. తద్వారా ఇళ్ల అనుమతులు సులభం అయ్యాయి..మొదటి సారిగా గెలిచిన శాసన సభ్యునిగా, మొదటి కౌన్సిల్ గా జోన్ల ను రాష్ట్రం లో మొదట మార్పు చేయటం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
యావర్ రోడ్డు నేడు 100 ఫీట్ ల వెడల్పు కమర్షియల్ జీవో తీసుకురావడం జరిగింది. కేంద్ర గైడ్ లైన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ జోన్ల ఏర్పాటు.రాష్ట్రం లో 130 మున్సిపాలిటి లో సర్వే చేస్తే జగిత్యాల 90శాతం పూర్తిగా అయిందన్నారు.
టీ అర్ నగర్, లింగంపెట్, హస్నా భాధ్, తిప్పన్న పెట్ లను కలపడం జరిగింది. కొందరు అధికారులు లోపం వల్ల రైతుల భూములు మాస్టర్ ప్లాన్లో వివిధ జోన్ రావడం జరిగింది. మాస్టర్ ప్లాన్ మున్సిపల్ తీర్మానించి నప్పుడు అన్ని పార్టీల కౌన్సిలర్ లు కూడా ఉండడం జరిగింది. అన్నారు.
ప్రతి పక్ష నాయకులు రైతులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేయటం జరిగింది. Go 238 డ్రాఫ్ట్ ప్లాన్ లో సలహాలు సూచనలు చేయాలని మాత్రమే చెప్పడం జరిగింది అని … ప్రజలకు ఇంకా ఏమైనా అపోహలు ఉంటే మాత్రం తొలగించు కోవాలని అన్నారు.. మళ్ళీ రివ్యూ చేసిన తర్వాత,మున్సిపల్ గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటేనే ఆమోదం పొందడం జరుగుతుంది అని అన్నారు.. 1996 లో కేంద్రం లో కాంగ్రెస్ అధికారం లో ఉన్నపుడే మాస్టర్ ప్లాన్ ముసాయిదా చేయటం జరిగింది. 2015 లో వెంకయ్య నాయుడు మళ్ళీ దీనిని అమలు చేయటం కోసం…. జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ లేకనే అభివృద్ది కి దూరం. అయిందన్నారు. స్కూల్, హాస్పిటల్ జోన్ లలో ఇండ్లు,రెసిడెన్షియల్ జోన్ లలో వ్యాపారాలు అనుమతులు ఎలా ఇచ్చారు.. లే అవుట్ లేక ఇష్టా రీతిన నిర్మాణాలు చేపట్టడం వల్లనే వర్షాలు వస్తె డ్రైనేజీ లు సరిపోని పరిస్థితి…గొల్ల పెళ్లి రోడ్డు విస్తరనలో ప్రతి పక్షాలు అనవసర రాద్దాంతం. చేస్తుందన్నారు.