తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ ల సీఎంలు !
J.SURENDER KUMAR,
కేంద్రం ఆగడాలు రోజు రోజు కు మితిమీరి పోతున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఢిల్లీ మున్సిపల్, ఎన్నికల్లో’ ‘ ఆప్’ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కానీ మేయర్ ప్రమాణస్వీకారానికి చేయడానికి ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి మేయర్ ఎన్నిక నిర్వహించుకోవాల్సి వచ్చిందన్నారు.కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, శనివారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ భేటీ తరువాత ముగ్గురు సీఎంలు, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కేంద్రం తీరుపై ముగ్గురు సీఎంలు మండిపడ్డారు. నాన్ బీజేపీ రాష్ట్రాల్లో కేంద్రం ఇబ్బంది పెడుతుంది. ఇది దేశమంతా చూస్తుందన్నారు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు..అసలు ఈ గవర్నర్ల వ్యవస్థ ఏంది ? గవర్నర్ వ్యవస్థతో పాలన ఎక్కడికి వెళ్తుందో దేశం అంతా గమనిస్తోందని కేసీఆర్ అన్నారు. భవిష్యత్ లో దేశం అంతా నేర్పుతుంది. మోడీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి. వంగి వంగి కోతి దండాలు పెట్టినా కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించారని కేంద్రానికి కెసిఆర్ చురకలు అంటించారు. అధికారుల బదిలీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే జరగాలని కోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్సు తీసుకొచ్చిందన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా ప్రధాని మోదీ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి మళ్లీ ఇబ్బంది పెడుతున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజల కు అవమాన అని కేసీఆర్ మద్దతుతో మాకు అండ పెరిగిందని క్రేజీవాల్ అన్నారు. ఎమ్మెల్యేల ను కొనుగోలు చేస్తున్నారని గవర్నర్ల తో రాజకీయం చేస్తున్నారని. మొత్తంగా బీజేపీ యేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బందులు పెడుతుందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
గతంలో షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు ఆమెకు అన్ని అధికారాలున్నాయని . కానీ ఇప్పుడు ప్రధాని మోదీ వచ్చాక పోయాయన్నారు. కేంద్రం నిర్ణయంతో ఢిల్లీ సీఎంగా తాను కీలక నిర్ణయాలు తీసుకోలేపోతున్నానని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామని, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నడిచేందుకు గవర్నర్ సహకరించలేదు. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.సుప్రీంకోర్టు ఆదేశాలతో గవర్నర్ బడ్జెట్ సమావేశాల్లో నా ప్రభుత్వం అని చదువుతూ ప్రారంభించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ నిలిపివేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఇండియా… ఒకే పువ్వు ఉండటం కుదరదు. దేశం ఒక మాల లాంటిది మాలలో అన్ని రకాల పూలు ఉంటాయని పంజాబ్ సీఎం భగవంత్ అన్నారు.