మంత్రి కొప్పుల ఈశ్వర్!
J.SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ధర్మపురి మండలానికి చెందిన 41 మంది కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు మంగళవారం ₹ 41,04,756 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమానికి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పంపిణీ చేశారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీయం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ పథకం వరంగా మారిందని ఆయన పేర్కొన్నారు.