ఎమ్మెల్సీ కవిత!
J.SURENDER KUMAR,
కొండగట్టు ఆంజనేస్వామి అనుగ్రహంతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
బుధవారం కొండగట్టు ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, అక్కడ నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
హనుమాన్ చాలీసా పారాయణం, ముగిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, మంచి జీవితాన్ని ప్రసాదించేటటువంటి, ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి, విజయాన్ని అందించే ఆంజనేయ స్వామిని కొలిచినట్టు అయితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అన్నారు.
ప్రతి గ్రామంలో ఆంజనేయస్వామి గుడి ఉంటుంది. కరోనా తెలంగాణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే హనుమాన్ పారాయణం చేయాలని కొండగట్టు ఆలయ పూజారి జితేంద్రయ్య సూచించారు. ఆంజనేయ స్వామి పారాయణానికి మించిన మందు లేదు అని ఆయన చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు కొండగట్టు అంజన్న సేవా సమితి పేరుతో జితేంద్రయ్య నేతృత్వంలో అందరం కూడా పారాయణం చేస్తున్నాం. కవిత అన్నారు.
.