సీసీ కెమెరాలు, డ్రోన్ ద్వారా నిరంతర మానిటరింగ్!
కాలినడకన వచ్చే భక్తుల బ్యాగులకు రేడియం స్టిక్కర్లు!
జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్!
J. SURENDER KUMAR,
పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని లక్షలాదిమంది అంజన్న భక్తులు కొండగట్టు ప్రముఖ పుణ్యక్షేత్రానికి తరలివస్తున్న నేపథ్యంలో శుక్రవారం భక్తుల భద్రత కోసం భారీ ఎత్తున పోలీసు బలగాలను కొండగట్టు క్షేత్రంలో జగిత్యాల ఎస్పీ భాస్కర్ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు.
కొండగట్టు క్షేత్రం ఆలయ పరిసరాలలో, సీసీ కెమెరాలు, నిరంతర డ్రోన్ కెమెరాలతో పోలీస్ శాఖ మానిటరింగ్ చేస్తుందని ఎస్పీ భాస్కర్ తెలిపారు. అంజన్న భక్తుల భద్రతలను అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ 24 గంటల పాటు పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.

హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవల కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు.

పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు, దీక్ష పరులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

ఏదైనా సమస్య ఎదురైతే జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు.
హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షపరులు కాలినడకన కొండగట్టుకు వచ్చే సమయం లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రేడియం స్టికర్స్ ను వారి బ్యాగులకు,

జెండా కు అంటించడం జరిగింది.రోడ్డు కు ఇరువైపులా నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాహనాలను గమనిస్తూ తమ యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

అనంతరం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాటలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి లు ప్రకాష్, సి.ఐ రమణమూర్తి, ఎస్. ఐ చిరంజీవి, వివిధ జిల్లాలకు చెందిన సి.ఐలు, ఎస్.ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.