ఎస్పీకి హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఫోన్!
పోలీస్ హెడ్ క్వార్టర్ కు ఎస్ఐ అటాచ్!
J. SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలోని ముస్లిం మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పట్టణ ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసౌద్దీన్ ఓవైసీ, జగిత్యాల ఎస్పీ భాస్కర్ ను విచారించారు.

మహిళను అసభ్య పదజాలంతో దూషించడం, చేయి చూసుకోవడం తదితర అంశాలను గూర్చి ఫోన్ ఎస్పీకి ఓవైసీ ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ తనకు హామీ ఇచ్చినట్టు ఓవైసీ పేర్కొన్నారు. ఇదే పరిశీలన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది.

జగిత్యాల పట్టణం కు చెందిన మైనార్టీ మహిళ, ఎస్సై భార్యకు మధ్య ఆర్టీసీ బస్సులో జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో, ఎస్సైకి అతని భార్య ఫోన్ చేసి జరిగిన గొడవ వివరించినట్టు బాధితురాలు కథనం. బస్సు జగిత్యాల పట్టణ కు రాగానే ఎస్సై బస్సు నిలిపి తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని, తన సెల్ ఫోను ధ్వంసం చేశాడని బాధితురాలి ఆరోపణ.

ఈ నేపథ్యంలో ముస్లిం సంఘ నాయకులు, సభ్యులు జగిత్యాల్ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా, రాస్తారోకో, ఆందోళన చేపట్టారు.
చేపట్టారు. జగిత్యాల మైనార్టీ నాయకులు ఎమ్మెల్సీ కవిత ను, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కలిసి ఎస్ఐపై ఫిర్యాదు చేశారు న్యాయం చేస్తామనీ వారు ధర్నా చేసిన మైనార్టీ నాయకులకు హామీ ఇచ్చారు.
విచారణ జరిపి చర్యలు చూసుకుంటా! ఎస్పీ భాస్కర్!
జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటానని ఎస్పీ భాస్కర్ ముస్లిం నాయకులకు బాధితురాలికి హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. ఎస్సై అనిల్ కుమార్ ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. రాయికల్ S.I కిరణ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు.

ఎస్పీతో చర్చలు జరిపిన వారిలో ఉజుమా షకీరా
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, సిరాజుద్దీన్ మనసూర్ కాంగ్రెస్ నాయకులు, అబ్దుల్ భారీ జగిత్యాల పట్టణ సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు, బాధితురాలు తరపున ఆరుగురు సమస్యపై చర్చించారు.