జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
నాలుగు రోజుల్లోగా ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కారం చెయ్యకపోతే రైతులతో కలిసి ధర్మపురి మంత్రి క్యాంప్ కార్యాలయం, ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడతాం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లురి లక్షణ్ కుమార్ హెచ్చరించారు.
ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
మీడియా సమావేశంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి
👉 రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.
👉 ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించాల్సిన కొనుగోలు సెంటర్లు ప్రస్తుతం ఒక్క అధికారి పర్యవేక్షణ కూడా లేకుండా కొనసాగుతున్నాయి.
👉 కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి కొనుగోలు సెంటర్ల వద్ద ఒక ప్రత్యేక అధికారి ఉండి, రైతులను ఎటువంటి ఇబ్బందులకు గురి చెయ్యకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు..
👉 మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, కటింగ్ పేరిట రైతులను ఇబ్బందులు పెడుతున్న మిల్లర్ల పైన చర్యలు తీసుకుంటామని మీడియా ముందు ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదు..
👉 ఇప్పటివరకు కటింగ్ పేరిట రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ఎంత మంది మిల్లర్ల పైన చర్యలు తీసుకున్నారు, కనీసం వారికి నోటీసులు అయిన జారీ చేశారా.
👉 కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి రైతుల గురించి ఎటువంటి పట్టింపు లేదు, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 45 రోజులు గడుస్తున్న 50 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు,
👉 ప్రాథమిక సొసైటీల ద్వారా 81 సెంటర్లు నడుస్తున్నాయి, ఎంతమంది సొసైటీ ఇంచార్జ్ లు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ,క్యాబినెట్ మంత్రుల పైన ఉంటుంది.
👉 జిల్లా నాయకుడిగా ఉన్న బండి సంజయ్ కూడా కేంద్రంలో ఉన్న మీ బిజెపి ప్రభుత్వ అధికారులతో,నాయకులతో మాట్లాడండి, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటు రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించండి..
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘన భట్ల దినేష్ ,ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందెని మొగిలి, యూత్ టౌన్ అధ్యక్షులు అప్పం తిరుపతి, రఫియోద్దీన్, స్తంభం కాడి గణేష్, ప్రశాంత్ ,దూడ లక్ష్మణ్, భరత్ తదితరులు పాల్గొన్నారు