మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రాసిన ఇద్దరు నకిలీ మావోయిస్టుల అరెస్ట్‌!

జగిత్యాల ఎస్పీ భాస్కర్‌ !

J.Surender Kumar,

మావోయిస్టుల పేరు తో బెదిరింపు ఉత్తరాలు రాసిన ఇద్దరు నకిలీ మావోయిస్టులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
బీర్‌ పూర్ మండలం నర్సింహులపల్లెకు చెందిన బోగ లక్ష్మిరాజం, సిరిసిల్లకు చెందిన పోలు ప్రకాశ్‌ అనే ఇద్దరు వ్యక్తులు బీర్‌పూర్‌ మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, సర్పంచులకు లేఖలు పంపి బెదిరింపులకు పాల్పడ్డారని, మీరు తయారు చేసిన లెటర్ ప్యాడ్ యంత్రాలను స్వాధీన పరుచుకున్నట్టు ఎస్పి తెలిపారు