మే 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల!

👉 జూలై, ఆగస్టు మాసం కోటా..

J.SURENDER KUMAR,

మే 24న ₹.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార విభాగం ప్రకటన విడుదల చేసింది.

₹ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన జూలై, ఆగస్టు నెలల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొనబడింది.