ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ద్వంద వైఖరిని విడనాడాలి! కేసీఆర్ టార్గెట్ గానే జీవన్ రాజకీయాలు !

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!

J.SURENDER KUMAR,

అన్ని తెలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుసరిస్తున్న ద్వంద వైఖరిని విడిచిపెట్టాలని రాజకీయ లబ్ధికోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల్ ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయం చూస్తుంటే విడ్డురంగా ఉందని ప్రజలకు వాస్తవాలను చెప్పడం మానేసి రాజకీయ లబ్ధికోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. సర్పంచ్ లకు అనేక కష్టాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని జీవన్ అన్నారని సంజయ్ పేర్కొన్నారు. అన్ని తెలిసిన జీవన్ రెడ్డి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల జాప్యంతోనే ఈ సమస్య అని తెలిసినా ఏనాడు కేంద్రాన్ని కానీ ఎంపీ అర్వింద్ ను నిలదీసిన దాఖలాలు లేవన్నారు. కేవలం కేసీఆర్ టార్గెట్ గానే జీవన్ రాజకీయాలు చేస్తాడని గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మకైన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు.

బీజేపీతో మూలాఖత్ ఆయి బీఆర్ ఎస్ ప్రభుత్వంపై బురదజల్లడమే జీవన్ రెడ్డి పనిగా పెట్టుకొన్నడన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కానీ తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన వాటిపై జీవన్ రెడ్డికి పట్టింపులేదన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఏనాడు జీవన్ మాట్లాడారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. గిరిజన యూనివర్సిటీ, నవోదయ విద్యాలయం, ఎన్టీపీసి నుంచి రాష్ట్రానికి రావాల్సిన 4 వేల మెగావాట్ల విద్యుత్ వంటి ఎన్నో విషయాలు ఉన్నా ఏనాడు జీవన్ రెడ్డి కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నాడని ఈ పద్ధతి మానుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు.
తెలంగాణ ప్రభుత్వంలోనే పల్లెలకు మహర్దశ పట్టిందని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద అభివృద్ధి కోసం అత్యధిక నిధుల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, పారిశుధ్య కార్మికులకు మంచి వేతనాలు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ గ్రామాన పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామానికో నర్సరీని ఏర్పాటుచేయగా గ్రామాలన్ని నందనవనాలుగా మారాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
నిరంతర విద్యుత్ ను ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పీక్ అవర్లో కరెంట్ వినియోగం పెరగడంతో 20 రూపాయలకు ఒక యూనిట్ కొనుగోలు చేసి నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు అందించామని ఎమ్మెల్యే చెప్పారు.
రాష్ట్రంలో 46 వేల చెరువులను అభివృద్ధి చేసిన ఘనత మాదని 60 ఏండ్ల మీ కాంగ్రెస్ పాలనలో నిర్మించిన వాటర్ ట్యాంక్ లకు తొమ్మిది రేట్ల ట్యాంకులను నిర్మించామని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని రైతులకు నీళ్లివ్వకుండా, విద్యుత్ ఇవ్వకుండా, పెట్టుబడి సాయం ఇవ్వకుంటే ఇంత పెద్ద మొత్తంలో దిగుబడి వచ్చేదా అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలతోనే తెలంగాణలో ధరలు అదుపులో ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరానికి నీరందడం లేదంటూ జీవన్ చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
అన్ని తెలిసిన సీనియర్ రాజకీయ నాయకులైన జీవన్ రెడ్డి ప్రజలకు నిజాలను చెప్పడం అలవాటు చేసుకోవాలని అసత్య ప్రచారాలు, విమర్శలు చేయడం మానుకోవాలని, ద్వంద వైఖరిని విధాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, సర్పంచుల ఫోరం చెరుకు జాన్, గంగాధర్, పాక్స్ ఛైర్మెన్ లు మహిపాల్ రెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, సందీప్ రావు, సర్పంచులు దామోదర్, మహేశ్వర రావు, తిరుపతి, రాజేశ్వర రెడ్డి, నాయకులు నాదెం శంకర్, ఎల్ల రాజన్న, అంజన్న, రౌతు గంగాధర్ తోపాటు పలువురు ఉన్నారు.