నరసింహులపల్లె సమస్యనే.. నకిలీ మావోయిస్టు లేఖలకు మూలమా ?

J. Surender Kumar,

నక్సల్స్ పోలీసులు తుపాకుల నీడలో దశాబ్దాల కాలం పాటు ఆటుపోట్లను అనుభవించిన గ్రామాల ప్రజల్లో ప్రశ్నించే తత్వం, అవినీతి, అక్రమాలను నిలదీసే ఆత్మ స్థైర్యం అధిక శాతం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. బీర్పూర్ మండలంలో గత రెండు రోజులు గా కలకలం సృష్టిస్తున్న మావోయిస్టు లేఖలకు ‘ నరసింహులపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న స్థల వివాదమే ప్రధాన కారణమనే చర్చ ఉంది.

కొందరు మాజీ లు రాజకీయ ప్రత్యర్థులను, వేధింపుల కోసం పంపించారనేది, లేఖలు అందుకున్న ప్రజా ప్రతినిధులకు తెలిసినా. తెలియనట్టు తమకు లేఖలు పంపించిన మాజీల ను చట్టపరంగా శిక్షించడం కోసం ఓ ప్రజా ప్రతినిధి శనివారం సాయంత్రం బీర్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
స్థల వివాదం!
నరసింహులపల్లి గ్రామ నడి బొడ్డున మందోట సమీపంలో అటవీ శాఖకు చెందిన విలువైన కొంత స్థలం ఉందనే చర్చ. ఓ వ్యక్తి ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నాడు అనే అంశములు గ్రామంలో కొందరి మధ్య వివాదాలు కొనసాగుతున్న అనే విషయం జగమెరిగిన సత్యం.


మాజీ మిలిటెంట్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు ?
నరసింహులపల్లి కు చెందిన మాజీ వార్ మిలిటెంట్ అనారోగ్య రీత్యా. జగిత్యాల ఉంటున్నాడు. శనివారం సాయంత్రం మావోయిస్టు లేఖల అంశాన్ని పోలీసులకు స్వయంగా వివరించినట్లు తెలిసింది. లేఖలు అందుకున్న కొందరు ప్రజా ప్రతినిధులు, ఆ మిల్టెంట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడి నీ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
ఇది ఇలా ఉండగా నరసింహులపల్లి గ్రామానికి చెందిన కొందరికి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో బంధుత్వం ఉన్నట్టు,. అక్కడే లేఖలు సృష్టించి కొందరు ప్రజా ప్రతినిధులకు పోస్ట్ చేసినట్టు చర్చ. పోలీస్ విచారణలో ఈ అంశం వెలుగు చూసిందా ? లేక ఊహగానాలా ,? అనే అంశంలో స్పష్టత లేదు. లేఖలు పంపిన సూత్రధారి ఎవరు అనే విషయం పోలీసు వర్గాలు నిర్ధారించుకున్నట్టు సమాచారం. అయితే మావోయిస్టు పేరిట ముద్రితమైన లెటర్ ప్యాడ్ ఎక్కడివి ? ఎంతమంది ఇందులో భాగస్వామ్యం అయ్యారు ? అనే విషయంలో పోలీసులు కూపి లాగుతున్నట్లు సమాచారం.