నేడు కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం !

బెంగళూరులోని కంటీరవ స్టేడియంలో..

J.SURENDER KUMAR,

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గం.కు బెంగళూరులోని కంటిరవ స్టేడియంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు..

ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి గవర్నర్ లేఖ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు కానున్నారు.

ప్రమాణస్వీకారం జరగనున్న కంటి వర స్టేడియం