J.SURENDER KUMAR,
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని, క్షణికావేశంలో చేసిన నేరాలకైనా, శిక్షలు తప్పవని అందరూ గమనించాలని సూచించారు.
అదేవిధంగా 2023 సంవత్సరంలో ఇప్పటి వరకు జగిత్యాల జిల్లా లో నేరం చేసిన వారికి పలు కేసులలో కఠినమైన శిక్షలు విధించడం జరిగిందని ముఖ్యంగా అందులో (5) కేసులలో కోర్టు జీవిత ఖైదు విధించినట్టు తెలిపారు.

👉 అప్పు తీర్చమన్నందుకు హత్య !
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర రోడ్డుకు చెందిన చంద్రశేఖర్ తన ఇంటి పక్కనే ఉండే శివరాజం నుంచి అవసరాల కోసం 2004లో 5000 అప్పు తీసుకున్నాడు శివరాజ0 ఎన్నిసార్లు అడిగినా చంద్రశేఖర అప్పు తీర్చకపోతే ఈ నేపథ్యంలో 2007 ఫిబ్రవరి 12న శివరాజు ఇంటికి వెళ్లి తన అప్పు తీర్చాలని పట్టబడుగా కోపోద్రిక్తుడైన చంద్రశేఖర్ శివ రాజ0 నీ తలపై రోగులుబండితో కొట్టాడు ఈ కేసులో నిందితునికి శిక్ష విధించడం జరిగింది
👉 కొడుకుని చంపిన తండ్రికి యావ జీవ శిక్ష*
పెగడపల్లి మండలం దోమలకుంటకు చెందిన నక్క రమేష్ డబ్బులు, పొలం విషయంలో భార్య గంగవ్వ కొడుకు జలంధర్ గొడవ పడడం జరిగింది ఈ నేపథ్యంలో నవంబర్ 12 2019 రోజున జలంధర్ ను రమేష్ కత్తితో పొడిచి చంపడం జరిగింది!
👉 తాతను చంపిన మనవడికి యావజీవ శిక్ష*
మేడిపల్లి మండలం కల్వకోట గ్రామానికి చెందిన ఆది మల్లయ్య అతని మనవడు చందు చందు కి జరిగిన కుటుంబ తగాదాల్లో జనవరి 17 2022 రోజున తాత మల్లయ్య పై దాడి చేసి చెప్పడం జరిగింది !
👉 యువకుడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితుడికి యావజీవ శిక్ష !
ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన ఆవుట్ల అజయ్ ఆవుట్ల రాజేష్ యువతీ విషయంలో గొడవ జరగా ఇదే మనసులో పెట్టుకున్నా అజయ్ రాజేష్ నీ 2017 ఫిబ్రవరి 27న రాత్రి కోమటి కొండాపూర్ గ్రామ శివారులో తీసుకెళ్లి హత్య చేయడం జరిగింది
👉 మహిళా హత్య కేసులో నిందితునికి యావజ్జీవ శిక్ష !
మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన ఎల్లయ్య కోరుట్ల మండలం మోహన్రావుపేట శివారులో మహిళను హత్య చేయగా పోలీసులు మృతురాలి కాల్ రికార్డు ఆధారంగా మల్లయ్య నే హత్య చేసినట్లు గుర్తించి జైలుకు పంపించడం జరిగింది.

ఇట్టి నేరాలను పకడ్బందీగా విచారణ జరిపి సాక్ష్యాదారాలను, సాక్ష్యులను తగు రీతిలో కొర్టులో ప్రవేశ పెట్టి ,ఇట్టి శిక్ష లు పడటానిక కృషిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జె.మల్లికార్జున్, ఎ.మల్లేశం, బాల త్రిపుర సుందరి , ఎస్. మురళి, రాజేష్, రజినీ, మాధవిలను అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున ఇట్టి నేరపరిశోధన అధికరులైన బి. జనార్ధన్ రెడ్డి ఎడిషనల్ ఎస్పీ రిటైర్డ్. వి.సురేందర్ ఏసిపి, టి. సాయి మనోహర్ ఓ ఎస్ డి, కె.రాజశేఖర్ రాజు, సిఐ, K. కిషోర్ సిఐ గార్లను కోర్టు లైజనింగ్ ఆఫీసర్స్ జి.రాజు నాయక్ ఎస్ఐ, యం.కిరణ్ కుమార్, డి.శ్రీధర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ డి.ఎల్లయ్య, కె. విద్యాసాగర్ లను తగురీతిలో వారిని సత్కరించి,వారికి రివార్డులు ఇచ్చుటకు ఉన్నాతాధికారులకు సిఫారసు చేసినట్టు ఎస్పీ భాస్కర్ తెలిపారు.