కార్యకర్తల శిక్షణ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు చేపడుతున్నారు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రం లోని దేవిశ్రీ గార్డెన్స్ లో గురువారం యూత్ జో డో..బూత్ జో డో నినాదంతో బూత్ స్థాయి కార్యకర్తల శిక్షణ కార్యక్రమం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు అధ్వర్యంలో నిర్వహించారు. ప్రియాంక గాంధీ విడుదల చేసిన మేనిఫెస్టో పోస్టర్ ను ఆవిష్కరించారు.
సమావేశానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రజలకు..నాయకుల మధ్య వారధి కార్యకర్తలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ.. ప్రజలకు చేరవేయాలి..
కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు రోజుకు ఒక గంట సమయం కేటాయిస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమనీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కెసిఆర్ అర్హత, నైతికత కోల్పోయాడు. తెలంగాణ సాధన లో విద్యార్థులు, యువకుల బలి దానాలతో ఏర్పడిన తెలంగాణ లక్ష్యం నీరు గారిపోయింది అని అన్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు ₹60 వేల కోట్లు ఉంటే, ప్రస్తుతం ₹ 5 లక్షల కోట్ల అప్పు చేశారు.
పుట్టబోయే ప్రతి బిడ్డ ₹ 1,25,000 అప్పుతో పుడుతున్నాడు. అని అన్నారు.
2022 – 23 లో బిశ్వా ల్ కమిటీ ప్రకారం 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయని, 80 వేల ఉద్యోగాలు ప్రత్యక్షం భర్తీ చేస్తామనీ సంవత్సరం గడుస్తున్న ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు అన్నారు.
టీ ఎస్ పీ ఎస్సీ ప్రశ్న పాత్రలు అంగట్లో అమ్మకానికి పెట్టారనీ ద్వజమెత్తారు.
ఉద్యోగాల భర్తీనీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ, నిరుద్యోగుల ఆశల పై నీళ్లుజల్లుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2024 నుండి నిరుద్యోగుల యువతకు ఆత్మస్థైర్యం కల్పించడానికి ₹.4,000 భృతి ఇస్తాం.
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం..
కాంగ్రెస్ మేనిఫెస్టో ను ప్రజల్లోకి తీసుకెల్లాలి.
2014 ఎన్నికల్లో సంవత్సరానికి 2 కోట్లు భర్తి చేస్తామన్నారు. పీ ఎం మోడీ ఎన్ని కోట్ల ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలనీ డిమాండ్ చేశారు. అదాని సంపద పెంచేందుకు మోడీ పని చేస్తున్నారనీ ద్వజమెత్తారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సిలిండర్ ధర పెరిగితే సామాన్యుడి పై భారం పడకుండా రాయితీ కల్పించామని గుర్తు చేశారు. ₹ 500 లకే సిలిండర్ ఇస్తామన్నారు. మత విద్వేషాలను రెచ్చగోడుతు బీజేపీ పబ్బం గడుపుతొంది.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కాదు. సామాజిక వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు.
దళిత బంధు ఎవరు లబ్ది పొందుతున్నారో..చర్చించాలి.!
సీఎం కెసిఆర్ జనాభా ప్రాతిపదికన కేటాయించిన ఎస్సీలకు ₹30 వేల కోట్లు, ఎస్టీ లకు ₹ 20 వేల కోట్లు ఖర్చు చేయకుండా దళితులను మోసం చేస్తున్నారు.
కెసిఆర్ ఏం ఐ ఎం, బీజేపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వెనకాడరు.

బీజేపీ, బీఆర్ఎస్ చుట్టాలు.
బీజేపీ తో సంబంధం లేని ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు.
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేన రెడ్డి..
ప్రజలకు సేవ చేసేందుకు అధికారం కోరుకుంటున్నాం అని అన్నారు.
గ్రామస్థాయిలో కమిటీలు వేయాలి..
కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుంది అని భరోసా ఇచ్చారు. బీజేపీ నాయకులు సోషల్ మీడియా తో లేనిది ఉన్నట్టు ప్రజలను తప్పు దోవ పాటిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు తప్పులను సరిదిద్దుకుని, పార్టీ నీ గ్రామస్థాయి లో పటిష్టం చేయాలి.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామన్న అంశాన్ని కెసిఆర్ కాపీ కొట్టి, నిరుద్యోగ భృతి అందించడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలు తెలియచెప్పాలి. ప్రతి కార్యకర్త ఇంటి పై జెండా ఎగుర వేయాలి.
యూత్ కాంగ్రెస్ యాప్ తో భవిషత్ లో యాప్ ద్వారా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేయనున్నామన్నారు.
గ్రామ స్థాయిలో సైనికుల్లా పని చేసే యువకులను ఎంపిక చేయాలి. రాబోయే ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజలను చైతన్యపర్చాలి. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి.
తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని చెబుతూ, ఇంటింటికీ వెళ్లి చెప్పాలన్నారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి అన్నారు.
కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేన రెడ్డి ఏ ఐ సీ సీ సెక్రెటరీ సురభి,
అర్పిత, శ్రీనివాస్ , పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, పిసిసి ఎన్ ఆర్ ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్, చాంద్ పాషా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపెల్లి దుర్గయ్య, కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, కృష్ణారావు, బాపు రెడ్డి, సింహ రాజు ప్రసాద్, మహిపాల్, శంకర్, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాల నుండి యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.,