ప్రజలను దగా చేయడంలో సీఎం కెసిఆర్ ను మించిన వారు ప్రప్రంచంలో లేరు.!

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

J.SURENDER KUMAR,

ప్రజలను మాయమాటలతో దగా చేయడంలో సీఎం కేసీఆర్ కు మించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరని  పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో ఇందిరా భవన్ లో బుధవారం ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి,  ఏఐసీసీ కార్యదర్శి నదిం జావేద్ తో కలసి విలేకరుల సమావేశం లో మాట్లాడారు.
దళిత సమాజం ఏ విధంగా దగా చేయబడుతుందో జీవన్ రెడ్డి బహిరంగ లేఖను విడుదల చేశారు..
సమాజం లో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారికి రాజ్యాంగం లో అంబేడ్కర్ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు. జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేసేలా నిబంధనలు పొందుపర్చారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలని యు పీ ఏ ఛైర్పర్సన్ కు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, నిధులు ఖర్చు చేయకుండ రాబోయే సంవత్సరంలో క్యారీ ఫార్వర్డ్ ను ఆసరాగా చేసుకొని దళితులను దగా చేస్తున్నారు అని ఆరోపించారు
.

👉 ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాటల్లో…
కేటాయించిన నిధులు, ఖర్చు చేయకుండా ఎస్సీ ఫండ్ 30,000 ఎస్టీ ఫండ్ 20,000 కోట్లు ఖర్చు చేయకుండా ఖజానా లో మూలుగు తున్నాయి . ప్రభుత్వానికి చిత్త శుద్ది లేక నిధులు ఖర్చు చేయలేదు.
👉 దళితులకు మూడు ఎకరాల భూమి పథకం కనుమరుగైంది..
👉 మూడు ఎకరాల భూమి 10లక్షలకు ఎకరం చొప్పున ఇచ్చిన దళితులకు ₹ 30 లక్షలు ఇవ్వాలి..
👉 కళ్యాణ లక్ష్మి నిధులు కూడా ఎస్సీ నిధుల నుండి వెచ్చిస్తున్నారు. ₹ 30 వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఇళ్లు లేని దళితులు ఉండరు.
👉 ఇందిరమ్మ పాలనలో ఇళ్లు లేని నిరుపేదలకు స్థలం సేకరించి, ఇళ్లు నిర్మించాం అని గుర్తు చేశారు .
👉 ఇప్పటికైనా దళిత బంధు ఇవ్వడం సంతోషమే..
👉 2021-2022  ప్రయోగాత్మకంగా నియోజక వర్గానికి 100 దళిత బంధు ఇస్తామన్నారు.
👉 2022-23 లో  దళిత బంధు పథకం కింద నియోజక వర్గంలో 1500 మందికి బడ్జెట్ లో ₹.17,700 కోట్లు కేటాయించినా ఒక్కరికీ కూడా ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు..
👉 ప్రజలు, ప్రభుత్వ చిత్తశుద్ది నీ గమనించండి అని ఎమ్మెల్సీ  పిలుపునిచ్చారు.
👉 మళ్ళీ నియోజక వర్గానికి 1500 మందికి దళిత బంధు ఇస్తా అన్నారు..సీఎం కెసిఆర్ మీ ఆలోచనలు కార్యరూపం దాల్చేల చూడాలి అని హితవు పలికారు.
👉 ఉమ్మడి రాష్ట్రంలో అర్హత ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం అమలు చేసినం.రాష్ట్రం ఏర్పడిన తర్వాత హౌసింగ్ డిపార్ట్ మెంట్ ఎత్తేశారు.
👉 స్వంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటే 3 లక్షలు ఇస్తామన్నారు. 2014 లో లక్షలతో..ఇంటి నిర్మాణ వ్యయం పెరుగుతుందా ?తగ్గుతుందా ? అని ప్రశ్నించారు.
👉 రాష్ట్రంలో 4 లక్షల ఇళ్లు కట్టేందుకు ₹ 12,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించి, ఆమోదం పొందారు. 2022-23 దళిత బంధు, స్వంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది శూన్యం..
మళ్ళీ టేప్ రికార్డ్  ఆన్ చేశారు.!
👉 జూలై లో స్వంత స్థలాల్లో అంటూ అని ఎద్దేవా చేశారు. ఇంత వరకు దళిత బంధు అమలుకు మార్గదర్శకాలు లేవు..మార్చి లో బడ్జెట్ ఆమోదం పొందింది., నవంబర్ లో ఎన్నికలు రావొచ్చు అని సీఎం కెసిఆర్ చెప్పారు.
జూలైలో ఇళ్లు మంజూరు ప్రక్రియనే పూర్తి కాదు.. నిర్మాణాలు ఎలా పూర్తి చేస్తారు. నా మాటల్లో నిజాల్ని ఆలోచించండి..
👉 ఎన్నికల నాటికి పత్రాలు మంజూరు చేసి,సంబర పెట్టడానికే. దళిత బంధు సైతం అమలుకు నోచుకోని అవకాశం లేదు.మంజూరు పత్రాలు మినహా..అమలుకు నోచుకోదు..
👉 దళిత సమాజాన్ని సీఎం కెసిఆర్  ఏవిధంగా మభ్య పెడుతున్నారో ఆలోచించండి. స్వయం ఉపాధి పథకం ఒక్కరికీ కూడా ఇవ్వని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే దేశంలో..
👉 బీసీ సామాజిక వర్గాలను మోసం చేస్తున్నారు.
👉 ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ మీ చేతిలో లేనప్పుడు ఇస్తామని ఎందుకు చెప్పారు .
👉 మైనారిటీలకు నిధులు కేటాయించడం మీ చేతిలోనే ఉన్నది కాదా ఎందుకు కేటాయించడం లేదు అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  లక్ష్మణ్ కుమార్, మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.