ప్రజా నాయకులు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి లు – జగిత్యాల్ డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

నిరంతరం ప్రజల్లో ఉంటు వారి కష్టసుఖాలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారంలో   రాజులేని పోరాటం చేస్తున్న, మాజీ మంత్రులు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్, బిజెపి పార్టీల, ప్రజా వ్యతిరేక విధానాలు, చర్యల పట్ల గ్రామ గ్రామాన వీరి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు రాజీ లేని పోరాటం చేస్తామని లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మాజి మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా మంగళవారం  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ధర్మపురి పట్టణం లోని నంది చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్ , ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందెని మొగిలి, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్,ధర్మపురి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీయొద్ధిన్, టౌన్ యూత్ అధ్యక్షుడు అప్పం తిరుపతి, కస్తూరి శ్రీనివాస్, స్తంభం కాడి గణేష్ ,సుముక్, ఇఫ్తికర్ ఎన్.ఎస్.యు.ఐ టౌన్ అధ్యక్షులు శ్రావణ్, ప్రశాంత్,దూడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
పరామర్శ!
ధర్మపురి పట్టణానికి చెందిన బొల్లారపు ఐశ్వర్య అనే చిన్నారిపై కుక్కలు దాడి లో గాయపడిన చిన్నారిని వారిని కుటుంబ సభ్యులను లక్ష్మణ్ కుమార్, పరామర్శించారు.