ఆర్థిక మూలాల పై దెబ్బ మీద దెబ్బ !
J.SURENDER KUMAR,
2 వేల నోట్లు చలామణి రద్దుతో బడా బాబులతో పాటు, బ్లాక్ మనీ ఉన్న కొందరు రాజకీయ నాయకులకు నోట్ల మార్పిడికి ఇబ్బందులు ఏర్పడతాయని చర్చ నెలకొన్న విషయం తెలిసిందే. . అయితే రిజర్వ్ బ్యాంక్ ప్రకటన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా నోట్ల మార్పిడికి మల్లగుల్లలు పడుతున్నట్టు చర్చ. చర్చకు చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా హమ్ర పోలీస్ స్టేషన్ పరిధి మహదేవ్ ఘాటు వద్ద గత రెండు రోజుల క్రితం భద్రత బలగాల వాహనాల తనిఖీలలో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లక్షలాది రూపాయలు విలువగల 2 వేల నోట్లు కట్టలు పట్టుబడ్డాయి. నోట్ల తో పాటు అనేక జాతీయ బ్యాంకుల పాసుబుక్కులు , భద్రత బలగాలు స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసినట్టు సమాచారం.
నోట్లతో పట్టుబడిన వారిని ప్రశ్నించగా మావోయిస్టు కమాండర్ మల్లేష్ తమన్న నోట్లు బ్యాంకులో మార్చవలసిందిగా ఇచ్చాడని వారు బీజాపూర్ ఎస్పి ఆంజనేయ వెర్నేష్ వివరించారు. పట్టుబడిన వారు బాసాగూడ గ్రామస్థులని గజేంద్ర మధ్వవి, లక్ష్మణ్ కుంజంల పై కేసు నమోదు చేసినట్లు వార్తా సంస్థ ఆయన వివరించారు.
ఈ సంఘటనతో అప్రమత్తమైన, పోలీస్ భద్రత బలగాలు రాష్ట్రంలోని పలు బ్యాంకుల వద్ద నిఘా ఏర్పాటు చేశారు.

మావోయిస్టు పార్టీకి అచ్చిరానికి కరెన్సీ నిలువల డంప్!
మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందకు ముందు పీపుల్స్ వార్ కు చెందిన లక్షలాది రూపాయలు డంప్ అడవిపిల్లి కారణంగా పోలీసులకు చిక్కింది. జగిత్యాల్ డివిజన్ రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధి కట్కాపూర్ సమీపంలోని చుక్కల గుట్ట బోరులో దాదాపు ₹ 28 లక్షల రూపాయలు డంప్ ను పోలీసులు పట్టుకున్నారు.
అడవిపిల్లి కారణంగా పట్టుబడింది!
ఓ గ్రామీణుడు అడవిపిల్లి ని వేటాడుతూ వెంటపడ్డాడు. పిల్లి చుక్కగుట్ట లోయలోకి పరిగెత్తింది. పిల్లినీ వెంటాడుతూ లోయలోకి పరిగెత్తిన ఆ వ్యక్తి కి ప్లాస్టిక్ వాటర్ క్యాన్లు లలో నిల్వ ఉంచిన ₹ 500/- నోట్లలు కనబడ్డాయి. అందులో కొన్ని నోట్లు తీసుకొని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ, టీ తాగిన ,బీడీ ప్యాకెట్ కొనుగోలు చేసిన, తాటి, ఈత వనంలో తదితర వ్యాపార కూడలలో ప్రతిదానికి ₹ 5 వందల నోట్ ఇవ్వడం, తిరిగి మిగతా డబ్బులు ( చిల్లర) మీరే ఉంచుకోండి అనడం, ఈ సమాచారం పోలీసులకు చేరింది. దీంతో ఆ వ్యక్తి కదలికలపై నిఘ పెట్టి, పోలీసులు పీపుల్స్ వార్ డంప్ కనుగొన్నారు. నోట్లు తడవకుండా ప్లాస్టిక్ వాటర్ క్యాన్ కట్ చేసి పెద్ద మొత్తంలో అందులో భద్రపరిచిన కరెన్సీ 1998-99 లో దాదాపు ₹ 28 లక్షలు స్వాధీన పంచుకునే కేసు నమోదు చేశారు.
రుణ విముక్తి వ్యవస్థకు చెక్!
పీపుల్స్ వార్ ఉద్యమ కార్యాచరణ పథకం లో భాగంగా ‘ గ్రామీణ రుణ విముక్తి వ్యవస్థ’ ను వార్ నాయకత్వం ప్రయోగాత్మకంగా జగిత్యాల్ డివిజన్లో శ్రీకారం చుట్టింది. ఖరీఫ, రబీ సీజన్లలో రైతులకు వడ్డీ లేని రుణాల పంపిణీ కోసం, వార్ కొందరు సానుభూతిపరుల వద్ద లక్షలాది రూపాయల ను నిల్వ ఉంచి, చిన్న కారు, సన్న కారు, బడుగు, బలహీన వర్గాల రైతులకు వారి ద్వారా వడ్డీ లేని రుణాలను అందించడం, పంట అమ్మకాల తర్వాత వారి నుంచి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకొని అవసరం ఉన్న రైతులకు చైన్ సిస్టం లా రుణాలు ఇచ్చేవారు. ఈ సమాచారం పసిగట్టిన జగిత్యాల్ డివిజన్ పోలీసులు గుట్ట కింద గ్రామం లో కొందరు రైతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న లక్షలాది రూపాయలను స్వాధీన చేసుకొని రుణ విముక్తి వ్యవస్థకు చెక్ పెట్టారు.
బెంగళూరు డెన్ లో పెద్ద మొత్తం ?
బెంగళూరులోని పీపుల్స్ వార్ డేన్ ఇన్చార్జిగా కొనసాగే గోవిందరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వార్ అగ్ర నాయకులు నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, సంతోష్ రెడ్డిలను పట్టుకొని కొయ్యూరు ఎన్కౌంటర్ లో వారిని మట్టుపెట్టారని, నాడు పీపుల్స్ వార్ కేంద్ర నాయకత్వం బహిరంగ ఆరోపణ చేసింది. పోలీసులకు ఇచ్చిన సమాచారంతోపాటు పెద్ద మొత్తంలో డెన్ లో ఉన్న నగదుతో గోవిందరెడ్డి విదేశాలకు పారిపోయాడని కూడా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా
పీపుల్స్ వార్ కు కోవర్ట్ ఆపరేషన్ తో చెక్
కరీంనగర్ జిల్లా పోలీసులు, దళ నాయకుడు కత్తుల సమ్మయ్య ద్వారా హుస్నాబాద్ లో భూపతి దళంను హతమార్చడం. కత్తుల సమ్మయ్య ,శ్రీలంక విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం. జడల నాగరాజు, జనశక్తి నాయకు రణధీర్, లాంటి వారి కోర్టు ఆపరేషన్, ఆధిపత్య పోరులో దళ నాయకులు, సభ్యులు మృతి చెందడంతో పాటు పెద్ద మొత్తంలో నిలువ నిధుల కు గండి పడ్డట్టు చర్చ.
దీనికితోడు 2016 లో ప్రభుత్వ నోట్ల రద్దు చర్యతో కాశ్మీర్ లో వేర్పాటువాద ఆందోళనకారులను కట్టడి చేయడంతో పాటు మావోయిస్టుల వద్ద నిలువ ఉన్న పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లు నిరుపయోగంగా మారాయి అలా చర్చ కూడా ఉంది.