రైతుల కోసం పోరాడే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం!
మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J. SURENDER KUMAR,
ధర్మపురి మండలం పర్యటనలో భాగంగా మంగళవారం గాదె పెల్లి గ్రామంలో ₹10 లక్షల తో పలు సిసి రోడ్లు ప్రారంభించి, అనంతరం తీగలధర్మారం గ్రామాల్లో ₹50 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
👉 రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ₹ 2016. పెన్షన్, రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలకు సన్నబియ్యం తో పోషకాహార భోజనం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా ?
👉 రైతుల కోసం మీరు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో చేయరు..చేస్తున్న కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తారా ?
👉తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి తెగించిన కేసీఆర్ . రాష్ట్ర అభివృద్ధి కోసం అదే పంథాలో ముందుకెళ్తారు
👉ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఐదు లక్షల బీమా రైతులకు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా ?
👉 నూతన వ్యవసాయ చట్టం పట్ల రైతుల తీవ్ర ఆందోళన సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా తెలంగాణ అభివృద్ధి లో దూసుకుపోతోంది
👉 తెలంగాణ రాకముందు పూర్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్న ఇటువంటి తరుణంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
👉 దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి అన్నారు. రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

👉 తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త దాన్ని మనం చూస్తున్నాం ఇవి దేశంలో ఎక్కడ వెతికిన కనబడదు ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి రైతాంగాన్ని అన్ని రంగాల్లో ముందుంచి వాళ్లకు ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకువచ్చినట్లు అయితే తప్పనిసరిగా రాష్ట్రం యొక్క భవిష్యత్ మారిపోతుంది అన్నారు.
👉 నీటి తీరువా, భూమి శిస్తు వసూలు
పన్నులన్నీ రద్దు చేసి రైతుకే ఎదురు ఏడాదికి పదివేలిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ వ్యవసాయరంగం దేశంలోనే ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నది..
👉 గత ఆరు సంవత్సరాలుగా రైతు అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిసుతన్నాయని అన్నారు. 👉 నూతన రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించి రైతులకు నాణ్యమైన 3 ఫేస్ విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా రైతులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు.
👉 నకిలీ విత్తనాలు మరియు గుర్తింపు లేని పురుగుల మందులు విక్రయిస్తున్న వ్యాపారస్తుల పై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.

👉 ప్రతి సంవత్సరం ₹ 1200 కోట్లు ఖర్చు చేసి రైతుకు భద్రత కల్పించే దిశగా రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, కరోనా సంక్షోభ సమయంలో సైతం రైతు బంధు పథకానికి కోతలు విధించకుండా ₹ 15 వేల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాలో జమ చేసామని మంత్రి అన్నారు.
👉దేశంలో నే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం
👉రైతు వేదికలు నిర్మించి రైతులకు మార్కెట్ లో పంట డిమాండ్, గిట్టుబాటు ధర, పంటలు పండించడంలో మెలుకవులు, ఎరువులు, విత్తనాల వినియోగం వంటి వాటి పై సంబంధిత అధికారులతో అవగాహన కల్పించడం జరుగుతున్నది
👉 ముఖ్యమంత్రి మనం అడక్కుండానే ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తుంది వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ వస్తుంది, రైతు బీమా వస్తుంది రైతుకు సంబంధించిన రైతుబంధు వస్తుంది దాదాపు ఒక గ్రామానికి ఒక కోటి రూపాయలు ఒక గ్రామానికి ప్రభుత్వం నిధులు వస్తాయి కల్యాణలక్ష్మి కింద డబ్బులు వస్తున్నాయి. అదే విధంగా మాతా శిశు ప్రోగ్రాం ద్వారా ఆడపిల్ల పుడితే ₹13 వేల రూపాయలు మగబిడ్డ పుడితే ₹12 వేల రూపాయలు వస్తాయి అన్నారు.
👉 ఈ రోజు ఈ పల్లె ప్రగతి అనేటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో గ్రామాల యొక్క రూపురేఖల్ని మార్చేసింది, ఒక గ్రామంలో ఏ ఉండాలి అవన్నీ కూడా దాదాపుగా గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కావలసినటువంటి అవసరాలకు పరిష్కారం అవుతున్నాయి.
👉 తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం ఉండాలని ఎటువంటి ఆలోచనలు చేసినటువంటి మహా నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్

👉 40 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో అభివృద్ధి కి అడ్డుపడ్డారా కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వం మే ఉంది కాదా అభివృద్ధి ఎందుకు జరగలేదు కాంగ్రెస్ నాయకులు చెప్పాలి అంటూ మంత్రి ప్రశ్నించారు