జూనియర్ పంచాయతీ కార్యదర్శులు!
J.SURENDER KUMAR,
తమ న్యాయమైన కోరిక డిమాండ్ పై స్పష్టమైన హామీ వస్తే తప్ప తాము సమ్మె విరమించమని స్పష్టం చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సామూహికంగా ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె 12వ రోజు విరమించి విధుల్లో చేరాలని మంగళవారం ఐదు గంటల లోపు ఉద్యోగాలలో చేరకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని విధించిన గడువుని జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శిలు సామూహికంగా బహిష్కరించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఓ దేవరాజు అడిషనల్ డిఆర్డిఓ నరేష్ ,, డి ఎల్ పి ఓ లు ఎంపీ ఓ రవి బాబు , జగిత్యాల టౌన్ హాల్ కి వచ్చి జాయినింగ్ పేపర్స్ తీసుకురావడం జరిగింది కానీ ఏ ఒక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శి కూడా జాయిన్ అవ్వకుండా తిరస్కరించారు. ఇది ప్రభుత్వాన్ని ఎదిరించడం కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పంచాయతీ కార్యదర్శులు అందరూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. తమ సమ్మె యదవిధంగా కొనసాగుతుందని జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కొమురయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 300 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది తామంతా కూడా ప్రభుత్వంకి స్పష్టమైన జీఓ వచ్చేవరకు వీధిలోకి హాజరు కాబోమని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి సంతోష్, రవళి, వంశీధర్ రెడ్డి, రాజిరెడ్డి, నునావత్ రాజు, మల్లికార్జున్, నజీమ్ అక్బర్, తదితరులు పాల్గొన్నారు