శ్రీ హనుమాన్‌ పెద్ద జయంత్యుత్సవాలకు సర్వం సిద్దం !

భద్రాచలం క్షేత్రం నుండి పట్టు వస్త్రాలు తలంబ్రాలు !

అధ్యాత్మికశోభ ఉట్టిపడేలా ముస్తాబైన కొండగట్టు క్షేత్రం!


నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు!


J.SURENDER KUMAR,

శ్రీ హనుమాన్‌ పెద్ద జయంత్యుత్సవాలకు కొండగట్టు ఆం జనేయస్వామి ఆలయం ముస్తాబయ్యింది.
కొండగట్టు అంజన్న స్వామికి భద్రాచలం నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వామి వారికి శుక్రవారం సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ . తలంబ్రాలు సమర్పించడంతో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఆరంభమైనాయి..ఈ వేడుక‌లో అర్చక స్వాములు, కళాకారులు భ‌క్తులు, ఆలయ అధికారులు, కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి దర్శించుకుని పూజించారు.
శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి

బ్రహ్మోత్సవాలల చరిత్రలో మొదటిసారి చేనేత పోచంపల్లి పట్టు వస్త్రాలు తయారుచేసి స్వామివారికి సమర్పణ సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవాలయం ట్రస్టీ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో సమర్పించనున్నారు.

అపూర్వ సుందర రూపం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రత్యేక విశిష్టత!


ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
శుక్రవారం నుంచి స్వామి సన్నిధిలో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి..ఉత్సవాల కోసం అంజన్న ఆలయంతో పాటు ఉప ఆలయాలకు రంగులు వేశారు.


దిగువ కొండగట్టు, దొంగలమర్రి, జేఎన్‌టీయూ మార్గంలో, కొండపైన స్వాగత తోరణా లు ఏర్పాటు చేశారు. ప్రతియేటా నిర్వహించే హనుమాన్‌ పెద్ద జయం తిని ఆదివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి లక్షలాదిగా అంజన్నదీ క్షాపరులు, భక్తులు కొండగట్టుకు చేరుకోనున్నారు. ఆలయానికి లైటింగ్‌ పనులు పూర్తి అయ్యాయి.
ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే అన్ని పనులు పూర్తి అయ్యాయి.


పర్యవేక్షణకు అధికారుల నియామకం!


కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ఈ నెల 12 నుంచి 14వరకు కొనసాగే ఉత్సవాలకు గాను భక్తులకు ఇక్కట్లు కలుగకుండా చిన్న జయంతికి ఏర్పాటు చేసినట్లుగానే ఎక్కడిక్కడ పర్యవేక్షణకు కలెక్టర్‌ శ్రీమతి షేక్‌ యాస్మిన్‌ బాష విభాగాలుగా ఏర్పాటు చేసి అధికారులను నియమించారు. కొండ పైకి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవో, ఎంపీవోలతో ఇన్‌చార్జీ, కోఆర్డినేటింగ్‌ ఇన్‌చార్జీలను నియమించారు. ప్రధాన ఆలయం, క్యూలైన్‌, కొత్త, పాత కోనేరుల వద్ద ఏర్పాట్లు, అన్న దానం, కేశఖండనం, దీక్షమండపం, బేతాళస్వామి ఆలయం, దేవస్థానం కార్యాలయం, సానా గెస్ట్‌హౌజ్‌, పార్కింగ్‌ ఏరియాలు, మెడికల్‌ క్యాంప్‌, వా టర్‌ పాయింట్స్‌, వలంటీర్లకు సౌకర్యాలు, రవాణ, విద్యుత్‌, అగ్నిమాపక,

రూట్‌మ్యాప్‌, బందోబస్తు, పారిశుధ్య తదితర వాటిని విభాగాలుగా చేశారు. ఎంపీడీవో, ఎంపీవో, తహసీల్దార్లు ఇన్‌చార్జీలుగా వారికి ఆర్డీవోలు, జిల్లా స్థా యి అధికారులు కోఆర్డినేటింగ్‌ ఇన్‌చార్జీలుగా నియమించారు.
మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు


పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని కొండగట్టులో మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఆధ్యాత్మిక ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి.


కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం చరిత్ర!
పూర్వకాలంలో రామ రావణ యుద్ధము జరిగే సమయంలో మూర్చపోయిన లక్ష్మణుడు గురించి సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తీసుకువచ్చేటప్పుడు ముత్యంపేట ప్రాంతంలో కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.


విగ్రహంలోని విశేషం
ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
చరిత్ర
త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం యజ్ఞయాగాదులు చేసుకొంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు, రామదూతను సాదరంగా ఆహ్వానించారు. మీ మర్యాద బాగుంది. ఇది ఆగవలసిన సమయం కాదు కదా! శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళి పోయాడు. కొన్నిరోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవకార్యాలను ఆటంకపర్చసాగారు. తిరిగి వస్తానన్న హనుమ రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరియైన భూతనాథుడి భేతా ళాన్ని ప్రతిష్ఠించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా, వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు ‘శ్రీ ఆంజనేయుడు’ స్వయంభువుగా వెలిసాడు. నాటినుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ, వారి దైవకార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు స్థల పురాణం
దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికికి అవధుల్లేకుండాపోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్యభాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీతకోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్క రాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథ చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారిపక్కన సీతాదేవి రోదించినట్టు చెప్పే కన్నీటిగుంత భక్తులకు దర్శనమిస్తాయి.