స్వర్గీయ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కు ఘనంగా నివాళులు !

J.SURENDER KUMAR,

స్వర్గీయ మాజీమంత్రి రత్నాకర్ రావు 3వ వర్ధంతి సందర్భంగా బుధవారం ధర్మపురి పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.
జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి ఆలయ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, తదితరులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
రత్నాకర్ రావు రాజకీయాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి అని, వారు ఈ ప్రాంతానికి ఇరిగేషన్ విషయంలో గాని, వైద్య సేవలు అందించడం విషయంలో గాని, పిల్లల విద్యకి సంబందించి విషయంలో చేసిన సేవలు మరువలేనివని, వారికి ఆరోగ్యం సహకరించని పరిస్థితిలో కూడా రైతుల గురించి, వారి కష్టాల గురించి ఆలోచించిన మహనీయమైన వ్యక్తి అని ఈ సందర్భంగా కొనియాడారు.
మాజీ మంత్రి రత్నాకర్ రావు ప్రాంతంలో రాజకీయంగా ప్రాతినిథ్యం వహించడం మా అదృష్టంగా భావిస్తున్నామని, వారి అడుగుజాడల్లో మేమందరం కలిసి నడుస్తామని, జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో రత్నాకర్ రావు విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘన బట్ల దినేష్, జైన ఎంపిటిసి బ్లాక్ కాంగ్రెస్ 1అద్యక్షులు కుంట సుధాకర్, మండలం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందేని మొగిలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, తిమ్మాపూర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్, కస్తూరి శ్రీనివాస్, షబ్బీర్, ఆశెట్టి శ్రీనివాస్, సుముక్, స్తంభం కాడి గణేష్, మల్లేష్, రఫియొద్దిన్, జైన ఉప సర్పంచ్ కోరుట్ల శ్రీను, పోచయ్య, ప్రశాంత్, గణేష్, తదితరులు పాల్గొన్నారు
.