తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన !

ఎస్పీ ఎగ్గడి భాస్కర్, అధికారులు!

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో చేపట్టనున్న కార్యక్రమాల ఏర్పాట్లను ప్రాంతాలను జగిత్యాల జిల్లా ఎస్పి భాస్కర్, పోలీసు అధికారులు బుధవారం పరిశీలించారు.
జూన్ 4వ తేదీ – ఆదివారం సురక్షా దినోత్సవం
!

సందర్భంగా కొత్త బస్టాండ్ నుండి టవర్ సర్కిల్, చౌరస్తా, మీదుగా జరిగే పెట్రోలింగ్ కార్స్, Blue colts, వెహికిల్స్ తో ర్యాలీ ప్రదేశాలను, మున్సిపల్ పార్కు దగ్గర ఏర్పాటు చేసి సభ ప్రాంగణం మరియు అదే రోజు సాయంత్రం సుమంగళి గార్డెన్ లో జరిగే కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. మరియు

జూన్ 12వ తేదీ – సోమవారం – తెలంగాణ రన్! మినీ స్టేడియంలో నుండి పార్కు వరకు జరిగే కార్యక్రమంనికి సంబంధించి చేయవలసిన ఏర్పాట్లు ను పరిశీలించారు. ఆదేవిదంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2వ తేదీన అమర వీరుల స్మారక స్థూపం పార్క్ ప్రారంభించనున్న దృష్ట్యా భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.
జిల్లా ఎస్పీ వెంట డిఎస్పి ప్రకాష్, టౌన్ ఇన్స్పెక్టర్ రామచందర్రావు, రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్, RI లు వామనమూర్తి , నవీన్, ట్రాఫిక్ ఎస్.ఐ రామ్ పాల్గొన్నారు.