తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి !

కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష !

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా సమీకృత సముదాయాల భవనంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద, ఎస్పి భాస్కర్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవరణ దినోత్సవ సందర్భంగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉదయం 8 గంటల వరకు కార్యాలయాలలో పతాకావిష్కరణ ముగించుకుని రావాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీలలో సర్పంచులు, మున్సిపాలిటిలో చైర్మన్లు పతాకావిష్కరణ చేయాలని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రగతి నివేదికను సందేశం రూపంలో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి నిర్ణయించారని మరియు అందుకు సంబంధించిన అంశాలు డ్రాఫ్టు రూపంలో ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. అలాగే దీనిలో మార్పులు చేర్పులు కూడా జరగవచ్చని అధికారులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రైతు బంధుకు సంబంధించి క్లస్టర్ లో అధికారులు రైతులను భాగస్వామ్యులను చేయాలని, ఇందుకోసం ఎన్ని పాంప్లేట్లు, ఫ్లెక్సీలు పెద్దవి, చిన్నవి ఎన్ని అవసరం అక్కడి అధికారులు రైతు సంఘాల కమిటి సభ్యులు కో-ఆర్దినేట్ చేసుకోవాలని ఆదేశించారు. ముందుగా ఉన్న 71 రైతు వేదికలను, వాటి ప్రాంగణాలను శుభ్రంగా చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. పాడైపోయినా, చిన్న చిన్న రిపేర్లు ఉన్న రైతు వేదికలను వెంటనే బాగు చేయించాలని వాటికీ తోరణాలు, లైటింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. మరియు రైతు భీమా పొందిన వారిని పిలిపించి వారితో కార్యక్రమంలో మాట్లాడించే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మైక్ సిస్టం, సీటింగ్ అరెంట్ మెంట్స్ అలాగే సాముహిక భోజనాలు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో భాగస్వాములై విజయవంతంగా పూర్తీ చేయాలని కలెక్టర్ కోరారు. అధికారులు తమ శాఖ ద్వారా చేయవలసిన కార్యక్రమాలను తప్పకుండా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద, ఎస్పి భాస్కర్, ఆర్దిఓలు వినోద్ కుమార్, మాధవి, జిల్లా అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, తదితరల పాల్గొన్నారు