20 సంవత్సరాల క్రితం జరిగిన పద్మక్క ఎన్కౌంటర్ ప్రస్తావనా !
ఒకేసారి 30 మందికి మావోయిస్టులో లేఖలా ?
లెటర్ ప్యాడ్ తోనే అనుమానాలు ?
J. SURENDER KUMAR,
దశాబ్దన్నర కాలం పాటు మావోయిస్టు కార్యకలాపాలు, కదలికలు ఉనికి లేని ప్రాంతంలో మావోయిస్టుల పేరిట ప్రజా ప్రతినిధులకు, పలువురికి ఉత్తరాలు రావడం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నది.
మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు, @ గణపతి స్వగ్రామం జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ కావడంతో, మావోయిస్టుల పేరిట వెలుగు చూసిన ఉత్తరాలకు పత్రికలలో, ప్రచార మాధ్యమాలలో ఉవ్వెత్తున ప్రచారం చోటుచేసుకుందని చెప్పవచ్చు.
ఓ ప్రజా ప్రతినిధికి అందిన ఉత్తరంలో. ‘ 12-03-2003 లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన పద్మక్క ( పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శి) మృతికి మూడు రోజుల ముందుగా ఓ వ్యక్తికి ఇచ్చిన ₹15 లక్షలు సిద్ధంగా ఉంచాలని రాయబడి ఉంది .
పద్మక్క ఎన్కౌంటర్ 2002 జూలై 2న జరిగింది!
ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి నేరెళ్ల సమీపాన సంకెనబోరు గుట్టల్లో 2002 జూలై 2న తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఉత్తర తెలంగాణ కార్యదర్శి ( పీపుల్స్ వార్ పార్టీ) నలకొండ రజిత అలియాస్ పద్మక్క హతమయింది. పద్మక్క తో పాటు స్పెషల్ యాక్షన్ టీం కమాండర్ సాగర్, మరో నలుగురు నక్సలైట్లు విక్రమ్, మానసలు మరో ఇద్దరు గుర్తుతెలియని నక్సల్స్ మృతి చెందారు. A.K 47 ,ఎస్ఎల్ఆర్, 303 తుపాకు రెండు, ఏడు కిట్ బ్యాగులు, డైరీలు సాహిత్యం పోలీసులు స్వాధీన పంచుకున్నారు.ఒకేసారి 30 మందికి లేఖలా ?
దశాబ్దాల కాలం పాటు నక్సల్స్, పోలీసుల మధ్య సతమతమైన గుట్ట కింద గ్రామాల ప్రజలకు వార్ కదలికలు, చర్యలు హెచ్చరిక ఎలా ఉంటాయో? తెలుసు, మండలంలో ఒకేసారి సర్పంచులకు, ఎంపీటీసీలకు, లేఖలు రాసిన సందర్భం లేదు. నక్సలైట్ కార్యకలాపాలు ఉదృతంగా ఉన్న సమయంలో మిల్టెంట్ల ద్వారానే ఆ గ్రామంలో ఒక్కరు లేదా ఇద్దరికో హెచ్చరిక లేఖలు పంపేవారు. పోస్టు ద్వారా పంపిన సందర్భాలు లేవు.
కొన్ని లేఖలలో కిరాణా దుకాణం, రేకుల షెడ్డు నిర్మాణం, తదితర వ్యక్తిగత ఆరోపణలు ఉన్నట్టు సమాచారం. వైటనర్ తో కొన్ని పదాలు తొలగించి వాటిపై కొన్ని రాతలు రాసినట్టు లేఖలో ఉన్నట్టు సమాచారం.
లెటర్ ప్యాడ్ లో వ్యత్యాసం !

2004 లో పీపుల్స్ వార్ పార్టీ బీహార్ మావోయిస్టు పార్టీతో కలిసి మావోయిస్టు పార్టీగా, మారింది. సర్పంచులకు అందిన లేఖలలో ‘ గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ ధ్వజమెత్తారు ‘ అని పేర్కొనబడింది. లెటర్ ప్యాడ్ లో ‘ మల్యాల ఏరియా కమిటీగా’ ముద్రితమై ఉంది.

మరో లెటర్ ప్యాడ్ హిందీలో ముద్రతమై ఉంది. గత నెల 7న మావోయిస్టు పార్టీ జారీ చేసిన పత్రిక ప్రకటనలలో తేదీ పేర్కొన్నారు. సర్పంచులకు జారీచేసిన లేఖలో తేదీలు లేవు. సమస్యలు , అధికారుల అవినీతి, ఎన్కౌంటర్లు తదితర అంశాలపై మావోయిస్టు పార్టీ జారీ చేసిన ప్రకటనలలో ఇట్టి అంశాన్ని ప్రచార సాధనాలలో ప్రచురించాల్సిందిగా కోరిన సందర్భాలు అనేకం. పీపుల్స్ వార్ పార్టీ లో మల్యాల ఏరియా కమిటీ నిర్మాణం లేదు, మల్యాల, కొడిమాల ప్రాంతాల్లో నాడు జనశక్తి కార్యకలాపాలు ఉండేవి. కేవలం జగిత్యాల ఏరియా కమిటీ, గోదావరి ఏరియా కమిటీ గా నాడు ప్రకటనలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి.

అక్రమంగా అటవీ భూములు అంటూ లేఖలో పేర్కొన్నారు తప్ప, గ్రామాల వారిగా సర్వే నెంబర్లు వారిగా లేఖలో పేర్కొనబడలేదు.
గత రెండున్నర దశాబ్దాల క్రితం బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం లో సర్వేనెంబర్ 4 అటవీ భూములు 1300 ఎకరాలను డబ్బులు తీసుకొని పట్టాలుగా ఇచ్చారంటూ నాడు నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధిని వార్ టార్గెట్ చేసింది. ప్రజా కోర్టు నిర్వహించి కొందరిని గ్రామ బహిష్కరణ చేశారు. కొందరు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేశారు. ఈ అంశంలో ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు మధ్య కొంతకాలం వివాదం నడిచింది. కమ్మునూరు గ్రామ శివారులో సర్వేనెంబర్ 64, 65, నరసింహులపల్లి శివారులో సర్వేనెంబర్ 124, కండ్లపల్లీ గ్రామ శివారులో సర్వేనెంబర్, 97,98 , రంగసాగర్ శివారులో 50 ఎకరాలు అటవీ భూముల ఆక్రమణ గురించి పేర్కొనకపోవడం. రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారంలో అక్రమాల ఆరోపణల అంశం పేర్కొనకపోవడం, ఓ ప్రజా ప్రతినిధి, మరో పైరవికారుడీ తో కలిసి ప్రజలకు అటవీ భూములు పట్ట చేస్తూ, దాదాపు రూ.200 వందల కోట్లు సంపాదించారు అని ఓ ప్రజా ప్రతినిధి లేఖలో పేర్కొనడంతో. అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యక్తిగత కక్షలో ? రాజకీయ ఆధిపత్యం పోరో ? తెలియదు కానీ, ప్రజా ప్రతినిధులకు అందిన లేఖలు పలు అనుమానాలకు ఆస్కారం కల్పిస్తున్నది.