ఆలయ పాలకవర్గ చైర్మన్ కర్నాటి రాంబాబు ఫిర్యాదు!
విచారణకు ఆదేశాలు జారీ.?
J.SURENDER KUMAR,
విజయవాడ దుర్గగుడి ఆలయ ప్రతిష్ట భక్తుల మనోభావాలు భంగం కలిగించే రీతిలో కార్యనిర్వహణాధికారిని భ్రమరాంబ వ్యవహరిస్తున్నారని, ఏసీబీ అధికారులుకు పట్టుబడిన నగేష్ ను ప్రోత్సహించిన భ్రమరాంబ అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు
ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఫిర్యాదు మేరకు ఈఓ పై విచారణ సీఎం ఆదేశం ఇచ్చినట్టు సమాచారం.
రాష్ట్రంలో అతిపెద్ద రెండో దేవాలయం రాజధాని విజయవాడ ప్రాంతంలో ఉన్న దుర్గగుడి కి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని భక్తుల మనోభావాలను, ఆగమ శాస్త్ర విరుద్ధంగా వ్యవహరిస్తూ ఈ ఓ భ్రమరాంబ ప్రభుత్వ ప్రతిష్ట, భక్తుల మనోభావాలు అమ్మవారి ఆలయ ఖ్యాతి కి బంగం కలిగించే రీతి లో

కార్యనిర్వహణాధికారి నీ వ్యవహరిస్తున్నారని ఆలయంలో అవినీతి కార్యకలాపాలకు సూత్రధారి ఈ ఓ అని సీఎం జగన్మోహన్ రెడ్డి కు ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు ఫిర్యాదులు పేర్కొన్నారు.
ఏసీబీ అధికారులకు పట్టుబడిన నగేష్ , ఈవో కు కుడి భుజంగా వ్యవహరించే వారిని అవినీతి ఆరోపణలు వచ్చిన ఉద్యోగులపై నగేష్ చేత విచారణ చేసే విధంగా భ్రమరాంబ ఆదేశాలు జారీ చేసిన తీరును చైర్మన్ ఫిర్యాదు లో పేర్కొన్నారు.
ఈవో భ్రమరాంబ హయాంలో చేపట్టిన నియామకాలు భారీ అవకతవకులు అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు.
టెండర్లు విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆలయ అభివృద్ధి పనులు పేరిట జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని సూత్రధారి భ్రమరాంబ అని ఫిర్యాదు చేశారు.
అమ్మవారి ఆలయ ప్రతిష్ట, ఆగమ శాస్త్ర విరుద్ధంగా భ్రమరాంబ వ్యవహరిస్తున్న తీరు పై సీఎం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ కు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.