వైభవంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, వసంతోత్సవము, పలవోత్సవము!

నవరాత్రి ఉత్సవాల భాగంగా!

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం వేళ స్వామివారికి అంగరంగ వైభవంగా వసంతోత్సవం, పల్లవ ఉత్సవం జరిగింది.

గత నెల 26 నుంచి ఆరంభమైన ఉత్సవాల్లో,  ఆదివారం సహస్ర కలశాభిషేకం, సోమవారం
చందనోత్సవం, నేడు స్వామివారి  వసంతోత్సవం, పల్లవ ఉత్సవాలు జరిగాయి. వేదపండితులు, అర్చకులు, సనాతన సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి పూజలు నిర్వహించారు.


మంగళవారం ఉదయం, వేదపండితులు, అర్చకులు, పురుషసూక్త ,  శ్రీసూక్తం,  కల్పోక్త ,  న్యాసపూర్వక ,  షౌడశోపచార పూజ , సహస్రనామార్చన,  పంచోపనిషత్తులతో, రుద్రాభిషేకం , మరియు వాస్తు , యోగిని,  క్షేత్ర పాలక , నవగ్రహ, సర్వతోభద్రమండలి ,  స్థాపిత దేవతాపూజలు నిర్వహించారు.

సాయంత్రం  దాతలు ఇచ్చిన క్వింటాళ్ల కొలది  ,   వివిధ రకాల పండ్లతో రసాలు చేసి శ్రీ స్వామివారికి లక్ష్మీ అమ్మవారికి, అభిషేకాలు,  ఉత్సవం, నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులను వివిధ రకాలైన పచ్చని చెట్లు కోమ్మలు , పళ్ళు సహజసిద్ధమైన, ప్రకృతి వాతావరణంలా వేదిక నలంకరించిన అందులో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను కూర్చుండబెట్టి, ప్రత్యేక పూజలు చేశారు.


ఈ సుందర దృశ్యం తిలకించడానికి భక్తజనం పడిగాపులు కాస్తారు. స్వామివారి ప్రసాద వితరణ కోసం భక్తజనం భారీగా తరలివచ్చి గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి ప్రసాదాలు స్వీకరించారు.

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,  కార్యనిర్వహణాధికారి , ఆలయ సిబ్బంది ,తదితరులు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.