అమరుడైన ఆదిలాబాద్ పెద్దన్న, మావోయిస్టు అగ్ర నేత కటకం సుదర్శన్!

ఆ నలుగురే జిల్లాలో ఉద్యమానికి ఊపిరి ఊదారు !

J.SURENDER KUMAR,

ఆదిలాబాద్ జిల్లాలో నక్సల్స్ ఉద్యమానికి  ఊపిరి ఉదిన నలుగురిలో కటకం సుదర్శన్ పాత్ర కీలకం.  మే 31న గుండెపోటుతో సుదర్శన్ మృతి చెందినట్లు సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనతో బయటి ప్రపంచానికి ఆయన మరణం వార్త తెలిసింది.

ప్రకటన సారాంశం ఇలా ఉంది !


బస్తర్‌ మావోయిస్టుల పొలిటికల్‌ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆనంద్‌ అలియాస్‌ కట్టం సుదర్శన్‌ మృతి, గుండెపోటుతో మృతి చెందారని సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేసి, మే 31న మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మృతి పట్ల కేంద్ర కమిటీ సంతాపం వ్యక్తం చేసింది. 20 నిమిషాలు దాటిన 20 నిమిషాలకు, ప్రెస్ నోట్‌తో పాటు, పొలిట్‌బ్యూరో కట్టం సుదర్శన్ మరణ చిత్రాలను కూడా విడుదల చేసింది, జూన్ 5 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా ఆనంద స్మరణ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది,


బెల్లంపల్లికి చెందిన ఆ నలుగురు!


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సుదర్శన్ తో పాటు, గజ్జల గంగారం, పెద్ది శంకర్, పులి మదనయ్య స్నేహితులు, 1985 – 86 లో జరిగిన  ఎన్కౌంటర్లలో సాయిని ప్రభాకర్, దగ్గు రాయలింగు, కైరి గంగారం లాంటి నక్సస్ నాయకులతో మృతి చెందడంతో ఆదిలాబాద్ జిల్లాలో నక్సలైట్ లో ఉనికి లేకుండా పోయింది. ఈ దశలో బస్తార్ అటవీ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన సుదర్శన్, గజ్జల గంగారం, పెద్ది శంకర్, పులి మదనయ్యలు, జిల్లావ్యాప్తంగా 20 దళాలను ఏర్పాటు చేశారు.   హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన  శనిగరపు వెంకటేశ్వర్లు, @ సాహు  మంగి కొండలలో రహస్య జీవనం కొనసాగిస్తూ   గోండు భాషను నేర్చుకొని, వారి భాషలోనే నక్సల్స్ ఉద్యమ భావజాలంను గోండు యువతకు వివరించి  ఆ నలుగురితో కలిసి మంగి దళమును ఏర్పాటు చేశారు.

సింగరేణిలో అధికారి హోదాలో  విధులు నిర్వహిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లిన సుదర్శన్ దాదాపు 5 దశాబ్దాల కాలంగా మావోయిస్టు పార్టీలోనే కొనసాగాడు.
సుదర్శన్ సీపీఐ (మావోయిస్ట్‌లు)లోని  తొమ్మిది మంది  కేంద్ర కమిటీ నాయకులలో ఒకరు మరియు సెంట్రల్ రీజియన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. 2004 ,లో నక్సలైట్ పార్టీని బీహార్ లోని సిపిఐ మావోయిస్టు పార్టీలో విలీనంలో. సుదర్శన్ ది క్రియాశీలక పాత్ర .
ఆనంద్,  మోహన్,  బీరేందర్‌జీ అనే మారుపేరులతో కూడా పిలువబడే సుదర్శన్,  దంతెవాడలో 70 ఉంది సిఆర్పిఎఫ్ బలగాలు నక్సల్స్ దాడిలో మృతి చెందిన సంఘటనలో మాస్టర్ మైండ్ సుదర్శన్ ది.అని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.  గత కొంతకాలంగా దండకారణ్యంలో నడవలేని దుస్థితిలో ఉన్న సుదర్శన్ ను గల సైకిల్ కావడిలా మోసేవారని, బిపి షుగర్ తదితర అనారోగ్యాలతో ఇబ్బంది ఇబ్బంది పడ్డట్టు సమాచారం, వడదెబ్బ గుండెపోటుతో మృత్యువాత పడడంతో మావోయిస్టు పార్టీలో సుదర్శన్ శకం ముగిసింది.