👉10 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ కు క్యాబినెట్ ఆమోదం!
👉6840 ఉద్యోగాల నియామకం క్యాబినెట్ ఆమోదం!
J.SURENDER KUMAR,
ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.
👉వివిధ శాఖల్లో 6,840 కొత్త పోస్టులకు కేబినెట్ ఆమోదం. ఇందులో 3,920 రిజర్వ్‌పోలీసు ఉద్యోగాలు, కొత్త మెడికల్ కాలేజీలు, వివిధ విద్యాసంస్థలు, ఇతర శాఖల్లో పోస్టులు.
👉కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సుమారుగా 10వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు మంత్రివర్గం ఆమోదం.
👉 ఏపీ వైద్యవిధాన పరిషత్‌లో 14,658వేలమంది ఉద్యోగులకు మేలు చేస్తూ మంత్రివర్గం నిర్ణయంవీరంతా సొసైటీ పరిధిలోనుంచి ప్రభుత్వంలోకి.
👉ఉద్యోగులకు ఊరటనిస్తూ కొత్త జీపీఎస్ విధానానికి కేబినెట్ ఆమోదం.
👉జిల్లా కేంద్రాల్లోనూ ఒకే తరహా హెచ్‌ఆర్‌ఏ. 👉జిల్లాకేంద్రాలన్నింటికీ కూడా 16శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు కేబినెట్ ఓకే.
👉ప్రకటించిన కొత్త డీఏ అమలుకూ మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్.
మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు
👉జీపీఎస్ ద్వారా ఆఖరు నెలజీతంలో 50శాతం పెన్షన్, ప్రతి ఆరునెలలకొకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న డీఏ మరియూ డీఆర్‌ల మాదిరగానే జీపీఎస్ పెన్షనర్లకు కూడా డీఆర్ వర్తింపు.
👉రాష్ట్ర భవిష్యత్తును, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీర్చిదిద్దిన ప్రభుత్వం.సీపీఎస్‌తో పోలికే లేకుండా జీపీఎస్ విధానం.
👉 రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి భద్రత నిచ్చేలా నిర్ణయాలు.
👉దేశానికి మార్గనిర్దేశంలా నిలవనున్న జీపీఎస్ విధానం.
👉ప్రభుత్వానికీ, ఉద్యోగులకూ ఉభయ ప్రయోజనకరంగా జీపీఎస్ విధానం.
👉 ఓపీఎస్ మరియు సీపీఎస్ పద్ధతుల్లో చూస్తే 2041నాటికి బడ్జెట్లో రూ.65,234 కోట్లు పెన్షన్లు రూపేణా చెల్లించాల్సి వస్తుంది.
👉రుణాలపై చెల్లింపులతో కలుపుకుని రాష్ట్ర సొంత ఆదాయంలో ఇది 220 శాతానికి చేరుకుంటుంది.
👉2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు ₹.3,73,000 కోట్లవుతుంది.
👉ఇప్పుడున్న సీపీఎస్ విధానంపైనా వివరాలు
తెలుసుకున్న కేబినెట్.
👉సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు వర్తింపు.
👉ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10శాతం జీతాన్ని, పెన్షన్ ఫండ్‌కు బదిలీచేయాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంది.
👉 రిటైర్ అయిన తర్వాత కార్పస్‌లో 60శాతాన్ని ఉద్యోగి తీసుకోవచ్చు. 40 శాతం సొమ్ము యాన్యుటీ పెన్షన్ స్కీంలో పెట్టుబడిగా పెట్టాలి.
👉ఇదంతా మార్కెట్‌తో లింక్ అయి ఉంటాయి.
సీపీఎస్ పెన్షన్‌లో పూర్తి అనిశ్చితి ఉంటుంది. మార్కెట్లో పరిస్థితులు ప్రకారం హెచ్చుతగ్గులు ఉంటాయి.
👉అంటే రావాల్సిన పెన్షన్‌కు గ్యారెంటీ ఉండదు.
👉బేసిక్ శాలరీలో 20.3శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం. కాని, ఇదికూడా వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది.
👉జీపీఎస్ ప్రకారం..
👉జీపీఎస్‌అయితే… పెన్షన్‌కు పూర్తి గ్యారెంటీ ఉంటుంది.
👉సీపీఎస్‌లానే ఉద్యోగి 10శాతం ఇస్తే, దానికి సమానంగా ప్రభుత్వం ఇస్తుంది.
👉రిటైర్ అయ్యేముందు చివరి శాలరీలో బేసిక్‌లో 50శాతం పెన్షన్‌గా అందుతుంది. సీపీఎస్‌తో పోలిస్తే జీపీఎస్ అందే పెన్షన్ 150శాతం అధికం.
👉మేనిఫెస్టోలో మరో హామీ అమల్లోకి
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్.
👉2014 జూన్ 2 నాటికి 5ఏళ్ల సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరికీ వర్తింపు.
👉 ఈ కటాఫ్ డేట్‌కు 10 ఏళ్లు ఉండాలని అధికారులు సిఫార్సు చేస్తే.. దాన్ని ఐదేళ్లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం.
👉దీంతో మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 99.5% శాతం అమలు చేసినట్టు అవుతుంది.
👉శాఖల వారీగా ఉద్యోగులను గుర్తించి, వారిని ఖరారు చేసే ప్రక్రియ నడుస్తోంది.
అన్ని జిల్లాకేంద్రాల్లోని ఉద్యోగులకు ఒకేలా హెచ్‌ఆర్‌ఏ:
👉అన్ని జిల్లాకేంద్రాల్లో 16శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తింపు చేస్తూ కేబినెట్ ఆమోదం
👉 ప్రస్తుతం సంబంధిత జిల్లాల్లో అందుకుంటున్న హెచ్‌ఆర్‌ఏ 12 «శాతం పెంపు.
👉01–01–2022 నుంచి డీఏ, డీఆర్ 2.73శాతం ఇచ్చేందుకు కేబినెట్‌ఆమోదం.
👉దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల అదనపు భారం.
12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్‌ఆమోదం.
👉పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
👉ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు.

👉 ప్రతి మండలంలో జనాభా భారీగా ఉన్న రెండు పట్టణాలు లేదా గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలి.
👉ఇందులో ఒకటి ప్రత్యేకంగా బాలికలకోసం, రెండోది కో– ఎడ్యుకేషన్ కోసం.
👉ఇది ప్రభుత్వ తీసుకున్న విధానం. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి.
దీంట్లో భాగంగా.. చిత్తూరు జిల్లా సొదుంలో బీసీ బాలికల గురుకుల కళాశాలలో రెండు, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస బీసీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
👉రాష్ట్రంలో ఆధార్ గుర్తింపు కార్డుకు చట్టబద్ధత.
👉చట్ట సవరణకు కేబినెట్‌ఆమోదం.
👉ఆంధ్రప్రదేశ్ ఆధార్ ఆర్డినెన్స్ – 2023కు ఆమోదం తెలిపిన కేబినెట్.
👉 ఇప్పటికే 16 రాష్ట్రాల్లో ఈ మేరకు చట్టం.
👉డీబీటీ కింద దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నగదును లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం.
👉 కాని,ఆధార్‌ను లీగర్‌ఐడెంటిటీగా గుర్తించే చట్టాన్ని ఏపీ చేయకపోవడంల్ల ఎస్‌జీటీ పరామీటర్స్‌లో పరిగణలోకి తీసుకోవడంలేదు.
👉దీనికోసం ఆధార్‌ను చట్టబద్ధమైన గుర్తింపుకార్డుగా పరిగణించేందుకు కేబినెట్ అంగీకారం.
👉2017– డెఫ్ ఒలింపిక్స్ టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతక విజేత, ఇండియన్ డెఫ్ టెన్నిస్ కెప్టన్ కుమారి షేక్ జాఫ్రిన్(కర్నూలు జిల్లా)కు సహకారశాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 సర్వీసు కింద జోన్ –4లో నియామకం. కుమారి జాఫ్రిన్ నియామకానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
👉దీనికోసం జోన్ 4 లో సూపర్ న్యూమరరీ పోస్టు మంజూరుకు కేబినెట్‌అంగీకారం.
👉28.35 ఎకరాల చిత్తూరు డైరీ భూములను అమూల్‌కు లీజుకు ఇచ్చేందుకు కేబినెట్‌అంగీకారం.
👉99 ఏళ్లపాటు లీజు.
👉 చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలన్నది ఎన్నో ఏళ్లకల.ఈ కలను నిజం చేస్తూ తిరిగి పునరుద్ధరిస్తున్నాం.
👉ప.గో.జిల్లా నర్సాపురంలో ఏర్పాటుచేయనున్న ఫిషరీస్ యూనివర్శిటీలో 65 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ఆమోదం.
👉నర్సాపురం ఫిషరీస్ సైన్స్ కాలేజీలో 75 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.
👉ఇది రాష్ట్రంలో రెండో ఫిషరీస్ సైన్స్ కాలేజీ. 👉 విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో నూతనంగా అడోలసెంట్ అండ్ చైల్డ్ సైకియాట్రి డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడంతో పాటు, చైల్డ్ సైకియాట్రిలో ఒక సూపర్ స్పెషాలిటీ యూనిట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. వీటిలో భాగంగా 11 పోస్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
👉కడప మానసిక వైద్యశాలలో కొత్తగా 116 పోస్టులు మంజూరుకు కేబినెట్ అంగీకారం.
👉 వచ్చే ఏడాది మరో మూడు మెడికల్ కాలేజీలు రెడీ. (పులివెందుల, పాడేరు, ఆదోని).
👉ఈ మూడు కాలేజీల్లో 2118 పోస్టులను మంజూరుకు కేబినెట్ అంగీకారం.
👉ఒక్కో కాలేజీకి 706 పోస్టులు.
రాజమండ్రి, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఈ ఏడాదే తరగతులు.
👉 వైద్య విధాన పరిషత్ చట్టానికి సవరణలు చేస్తూ కేబినెట్ నిర్ణయం.ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్ యాక్ట్ 1986ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
👉స్వయంప్రతిపత్తిగా ఉన్న ఏపీ వైద్యవిధానపరిషత్ అటానమస్‌ను రద్దు చేయడంతో పాటు ఏపీవీవీపీని.. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రభుత్వ శాఖగా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
👉రాజానగరం అసెంబ్లీ పరిధిలో సీతానగరం పీహెచ్‌సీని సీహెచ్‌సీగా మార్చనున్న ప్రభుత్వం.
👉ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సీహెచ్‌సీ ఉండే విధానానికి అనుగుణంగా ఏర్పాటు.
👉ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిల్లో 41 మంది స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ వైద్యులను రెగ్యులర్ పద్ధతిలో నియామకానికి కేబినెట్ అంగీకారం.
👉2023 పదోతరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను సన్మానించి స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2023 లను అందించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
👉 జూన్28 నుంచి అమ్మ ఒడి. పదిరోజులపాటు కార్యక్రమాలు.
👉 జూన్12న జగనన్న విద్యాకానుక అమలు.
👉 ప్రతి విద్యార్థికీ విద్యాకానుక కింద కనీసంగా .₹ 2200లు ఖర్చు చేస్తున్నాం.
👉ఇందులో భాగంగా 476 జూనియర్ కాలేజీల్లో వాచ్‌మెన్లు నియామకం.
👉రెవిన్యూ డివిజనల్ స్ధాయిలో కూడా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నియామకం.
👉 స్కూళ్లో అమలవుతున్న కార్యకలాపాల సమగ్ర పర్యవేక్షణకు ఏర్పాటు. కేబినెట్ ఆమోదం.
ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ ఎగ్జామ్స్.
ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఈటీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం.
ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
👉3వ తరగతి పిల్లల నుంచి టోఫెల్‌ఎగ్జామ్స్.
టోఫెల్ ప్రైమరీ ( 3–5 తరగతులకు), టోఫెల్ జూనియర్ పరీక్ష (6–10 తరగతులకు).
వీరికి సర్టిఫికెట్ ఇస్తారు.
👉పిల్లలు ఉత్తమ ప్రతిభ చూపితే..వారి ఇంగ్లిషు టీచర్‌ను 3 రోజుల శిక్షణకోసం అమెరికాలోని ప్రిన్సెటన్‌కు పంపిస్తారు.
👉రాష్ట్రంలో నాలుగు ఐఆర్ బెటాలియన్లు ఏర్పాటులో భాగంగా ప్రతి బెటాలియన్‌కు 980 పోస్టుల చొప్పున మొత్తం 3920 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.
👉 గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్‌అమ్మెనియా పాలసీకి కేబినెట్ ఆమోదం.
ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్, 2 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మోనియాను వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తిచేయాలన్నది ఈ పాలసీ లక్ష్యం.
ఈ ఉత్పత్తిచేసే పరిశ్రమల స్థాపనద్వారా కూడా గణనీయంగా పెరగనున్న పారిశ్రామిక ప్రగతి.
దాదాపు 12వేలమందికి ఉద్యోగాలు
👉అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటుచేయనున్న రెన్యూ వోయేమాన్ పవర్ ప్రై.లిమిటెడ్.
👉 దాదాపు రూ.1800 కోట్ల పెట్టుబడులు.
👉 300 మందికి ఉద్యోగాలు.
ఆమోదం తెలపిన రాష్ట్ర మంత్రివర్గం.
👉మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఆప్టిక్ ఫైబర్ కేబుల్.
డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు, పీహెచ్‌సీలు న్నింటికీ హై బ్యాండ్ విడ్త్.
మారుమూల ప్రాంతాల్లోకి కూడా అందుబాటులోకి రానున్న 5జి సేవలు.
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు ₹.445.7 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అంగీకారం.
👉₹.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలకు మినహాయింపులు.
వీటి నిర్వహణలో తగ్గనున్న ప్రభుత్వ జోక్యం.
ఇకపై సులభంగా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేందుకు వెసులుబాటు.
ఐదేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది.
బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
ఇదే సమయంలో పారదర్శకతను పాటించేందుకు ఫిర్యాదులు వస్తే.. వాటిని విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
👉దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు చర్యల్లో భాగంగా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.
👉ఆక్రమణలు తొలగించేందుకు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా సవరణ.
కాలపరిమితితో సంబంధం లేకుండా ఇదివరలో ఇచ్చిన ఉత్తర్వుల పరిశీలనకూ ప్రభుత్వానికి అధికారాలు.
👉 ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సెక్షన్ 5 ను (రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి విలీనం చేస్తూ ) సవరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
👉గుంటూరు జిల్లా తాడేపల్లిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) సంస్ధ ఏర్పాటుకు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
👉 వైయస్సార్ కడప జిల్లా సీ.కె.దిన్నె మండలం మామిళ్లపల్లెలో 3.70 ఎకరాలు, కడప మండలం చిన్నచౌక్‌లో 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని కడప జిల్లా బెస్త సంఘానికి కేటాయించాలన్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
👉 అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
👉గతంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కొటిక్స్ సంస్ధకు కేటాయించిన 10 ఎకరాల స్ధలాన్ని అదే ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి అనుకూలంగా మార్పు చేస్తూ నిర్ణయం.
👉ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం, చేవూరు గ్రామంలో 40 సెంట్ల ప్రభుత్వ స్ధలాన్ని ఏపీ మారిటైం బోర్డుకు రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు కోసం బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
👉 ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం, రావూరు గ్రామంలో 9.46 ఎకరాల ప్రభుత్వ స్ధలాన్ని ఏపీ మారిటైం బోర్డుకు రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు కోసం బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
👉ఏర్పేడు మండలం వికృతిమాలలో 15.15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.