ఆయుధాలతో (పిస్టల్) ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ !

అమెరికా మేడ్ ఫెస్టివల్ స్వాధీనం!


ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !

J.SURENDER KUMAR,

అక్రమంగ పిస్టల్ మరియు మందుగుండు సామగ్రి కలిగి ఉన్న ఐలాపూర్ గ్రామానికి చెందిన సందరగిరి లక్ష్మి నర్సయ్య s/o లచ్చయ్య ను ఆయుధంతో సహా అరెస్టు చేసినట్టు జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు.

గురువారం ఎస్పీతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. బుధవారం సాయంత్రం అక్రమంగ పిస్టల్ మరియు మందుగుండు సామగ్రి తో ఐలాపూర్ నుండి కోరుట్ల వైపు కి వస్తున్నాడని సమాచారం రాగ కోరుట్ల CI ప్రవీణ్ కుమార్, కోరుట్ల SI సతీష్ మరియు సిబ్బంది సత్తయ్య, సంతోష్,కేశవ్, సాగర్, శ్రీను లతో ఐలాపూర్ గ్రామా శివారులో వెహికిల్ చెకింగ్ చేస్తుండగా బైక్ పై వచ్చిన నిందితుడు పోలీస్ వారిని చూసి అక్కడి నుండి తప్పించుకొని పారిపోతుండగా నిందితుడు సందరగిరి లక్ష్మి నర్సయ్యను పోలీస్ వారు పట్టుకొని వెంటనే చెక్ చేసి నిందితుడి మోటార్ సైకిల్ ట్యాంక్ కవర్లో నుండి 1 పిస్టల్ (Auto Pistol made in USA), 2 మాగ్జిన్ లు,3 బుల్లెట్లను (KF 7.65 Live Rounds), ఒక సెల్ ఫోన్ ను ఇద్దరు పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకుని కేసు చేసినట్టు తెలిపారు.


వివరాల్లోకి వెళ్తే
ఐలాపూర్ గ్రామానికి చెందిన సందరగిరి లక్ష్మి నర్సయ్య s/o లచ్చయ్య అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా పండ్ల వ్యాపారం చేస్తూ దాదాపు ₹ 50 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఈ క్రమంలో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గత 7 నెలల క్రితం ముంబై లోని అసాంఘిక వ్యక్తులతో పరిచయం ఉన్న రాజు బాయి @ గంగారాం ద్వారా ముంబై కి చెందిన నారాయణ, రమేష్, పాటిల్ మరియు బిట్టు @ బంటిల సహాయం తో ముంబై లో ఒక పిస్టల్ ను ఒక లక్ష రూపాయలకు కొనుగోలు చేసినట్టు వివరించారు. లక్ష్మీ నరసయ్యను అరెస్ట్ చేయగా మిగతావారు పరారి లో ఉన్నారని
నిందితుడిని అరెస్ట్ చేసి మరియు అతని వద్ద నుండి 1 పిస్టల్(Auto Pistol made in USA), 2 మాగ్జిన్ లు,3 బుల్లెట్లు, మోటార్ సైకిల్ B.NO. AP-15-AX-6774, ఒక redmi మొబైల్ స్వాధీనం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన DSP రవీందర్ రెడ్డి, కోరుట్ల CI ప్రవీణ్ కుమార్, కోరుట్ల SI సతీష్ మరియు సిబ్బంది సత్తయ్య,సంతోష్, కేశవ్, సాగర్, శ్రీను లను జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అభినందించారు.