J.SURENDER KUMAR,
ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రను సోన్‌ప్రయాగ్ లో నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ, “భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు తదుపరి ఉత్తర్వులు ప్రకటించే వరకు కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్టు ” తెలిపారు.
ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ ప్రకారం గత 24 గంటల్లో హరిద్వార్‌లో, 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, డెహ్రాడూన్, (33.2), ఉత్తరకాశీ, (27.7) నమోదైంది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సచివాలయంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రాష్ట్రంలో భారీ వర్షాల పరిస్థితిపై అధికారులతో సమీక్షించినట్టు సి ఎం ఓ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర పరిధిలోని జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని, ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులను అప్రమత్తం చేశారు
“అన్ని జిల్లాలతో అధికారులతో పరస్పర సమన్వయాన్ని కొనసాగించండి. తద్వారా అత్యవసర పరిస్థితులను సకాలంలో ఎదుర్కోవచ్చు అన్నారు. విపత్తు సహాయ, సహాయక చర్యల కోసం ఎల్లవేళలా అలర్ట్ మోడ్‌లో ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారని సీఎం ఓ కార్యాలయం ప్రకటనలో పేర్కొన్నారు.
“ఉత్తరాఖండ్ పోలీసు సిబ్బంది భక్తులకు సురక్షితమైన దర్శనం మరియు చార్ధామ్ యాత్రకు సేవలు అందిస్తున్నారు అని ఇప్పటివరకు 30 లక్షలకు పైగా (గంగోత్రి- 5,35,327; యమునోత్రి- 4,65,295; కేదార్‌నాథ్- 10,17,195; బద్రీనాథ్- 8,98,221; హేమ్‌కుండ్ సాహిబ్- 88,455) భక్తులు చార్ ధామ్‌ను సందర్శించిన తర్వాత వారి గమ్యస్థానాలకు జూన్ 22 నాటికి చేరుకున్నట్టు పోలీస్ వర్గాలు స్పష్టం చేశారు.. శ్రీ కేదార్‌నాథ్‌ను 10 లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారు” అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ తెలిపారు.
చార్ ధామ్ యాత్ర నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిగి ఉంటుంది: గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్. గంగోత్రి మరియు యమునోత్రి యొక్క కపట్ (తలుపు) భక్తుల కోసం ఏప్రిల్ 22న, అక్షయ తృతీయ పవిత్రమైన రోజున తెరవబడింది. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ ధామ్, ఏప్రిల్ 27న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి.
(యుగ్ మార్క్ సౌజన్యంతో)