మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ !
J.SURENDER KUMAR,
శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ పై వెంకట్ కాచర్ల దర్శకత్వంలో నరేష్ వర్మ నిర్మించిన బైరాన్ పల్లి చిత్రంలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రిలీజ్ చేశారు . ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ కళాకారులతో తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన చిత్రం బైరాన్ పల్లి అని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు .
కార్యక్రమంలో నిర్మాత నరేష్ వర్మ , దర్శకుడు వెంకట్ కాచర్ల, సీనియర్ జర్నలిస్టు ,దర్శకులు అయిలు రమేష్ , సంగీత దర్శకులు, గాయకులు పూర్ణచంద్ర బైరి, సీనియర్ నటి ప్రభావతి , కృష్ణ మంజూష , సింగర్ సాయి కీర్తన , తదితరులు పాల్గొన్నారు.
బైరాన్ పల్లి సినిమా ఎందుకు ప్రశంసలు అందుకుంటుంది?
బైరాన్ పల్లి మూవీ రివ్యూ…..
బైరాన్ పల్లి సినిమా జూన్ 6 న ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ షో వేశారు. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల కురిపించారు. కథాంశా బైరాన్ పల్లి అనే ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో సామాన్య జనంలో ఉండే అపోహలను, మూఢనమ్మకాలను ఆధారం గా పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో, తెలంగాణ యాస లో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. గ్రామీణ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినప్పటికీ బైరాన్ పల్లి చిత్రం ప్రత్యేకమైన దనే చెప్పాలి.

ఎందుకంటే ప్రతి సీన్ లో ఒక కొత్త విషయాన్ని ప్రేక్షకులకు రివీల్ చేస్తూ చివరి సీన్ వరకు ఉత్కంఠను రేపుతూ కొనసాగుతుంది స్క్రీన్ ప్లే. చిన్న సినిమానే అయినా విజువల్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది.. డైలాగ్స్ సినిమాటిక్ టచ్ తో కాకుండా చాలా సహజంగా అనిపిస్తాయి.. నటీ నటులు అందరూ సహజంగా నటించిన తీరు బాగుంది…ఎంత ప్రయత్నించినా చివరి దాకా స్టోరీ ని predict చెయ్యలేం..అంత పక్కాగా రాసుకున్న script అని చెప్పవచ్చు…కథ రొటీన్ గా కొన్ని ప్రధాన పాత్రల మీదే ఆధారపడకుండా సినిమాలో కనిపించే ప్రతి పాత్ర కథలో ఒక మలుపుకు కారణమవుతు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ఓవర్ ఆల్ గా బైరాన్ పల్లి సినిమా ప్రేక్షకుల వూహకు అందని థ్రిల్లర్..
సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది.. ఒక సస్పెన్స్ thrillers సినిమాకి ఎలాంటి విజువల్ ఎలివేషన్ కావాలో అది 100% వచ్చింది.. Background score సినిమాని next లెవెల్ కి తీసుకెళ్ళింది.. కొంచెం వింటేజ్ టచ్ తో రీ రికార్డింగ్ సస్పెన్స్ ని బాగా ఎలివేట్ చేసింది..
రచయిత గా దర్శకుడిగా వెంకట్ కాచర్ల ఒక ప్రత్యేకమైన డిజైన్ వేసుకుని అందుకు అనుగుణంగా సినిమాను ప్రతి సన్నివేశం చాలా శ్రద్ధ తో తీసాడు అనిపిస్తుంది..కొత్త నటీనటులతో ఇంత మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం వెంకట్ కాచర్ల ప్రతిభకు నిదర్శనం..