‘చదవటం మాకిష్టం’ కార్యక్రమంలో విద్యార్థుల కోసం పుస్తకాల సేకరణ !

J.SURENDER KUMAR,

మన ఊరు మన గ్రంథాలయం కార్యక్రమం
తిరువూరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చదవటం మాకిష్టం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో పఠనాసక్తిని పెంచి, స్మార్ట్ ఫోన్ వినియోగం తగ్గించేందుకు ‘మన ఊరు మన గ్రంథాలయం’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఈ కార్యక్రమానికి స్పందన లభిస్తున్నట్లు జేవివి ప్రతినిధి యం.రాం ప్రదీప్ తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో బుక్ బ్యాంక్ ఏర్పాటు చేయించడం, దాతల సహకారంతో పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు కొనుగోలు చేయడం, తెలుగు రాష్ట్రాలలోని వివిధ రచయిత ల నుంచి పుస్తకాల సేకరించి విద్యార్థులకు ఇవ్వడం వంటివి చేపడుతున్నట్లు తెలిపారు. వేయి పుస్తకాల సేకరణ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, ఇప్పటి వరకు 150వరకు సేకరించినట్లు ఆయన తెలిపారు.

పుస్తకాలు పంపాలనుకునేవారు ఈ క్రింద చిరునామాకు పంపవచ్చని తెలిపారు. పుస్తకాలు పంపించినట్లయితే తిరువూరు లో పుస్తక పరిచయం, పుస్తక సమీక్ష వంటి కార్యక్రమాలు నిర్వహిస్తానని ఒ ప్రకటనలో తెలిపారు.

పంపించాల్సిన వారికి అడ్రస్!
యం. రాం ప్రదీప్
10-263-6,ఆర్చ్ రోడ్,
సాయి రాఘవ కాలనీ, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా
ఆంధ్రప్రదేశ్ , పిన్ 521235
ఫోన్ 9492712836