J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమర్థ పర్యవేక్షణలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు తెలంగాణ పట్టణాలను ప్రగతి పథంలో అభివృద్ధి జరుగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ధర్మపురి పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతి ర్యాలీని మున్సిపల్ ఆఫీస్ నుండి మంత్రి కొప్పుల ఈశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

పట్టణాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “పట్టణ ప్రగతి” కార్యక్రమంతో తెలంగాణ పట్టణాలు తొమ్మిదేండ్లలోనే సరికొత్త రూపును సంతరించుకున్నాయి.

ధర్మపురి మున్సిపల్ పరిధిలోని ఎస్ హెచ్ గార్డెన్ లో నిర్వహించిన * పట్టణ ప్రగతి * కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నూతన గా ఏర్పాటుచేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.

మున్సిపల్ సిబ్బందికి శాలువాతో సత్కరించి వారికి మెరిట్ సర్టిఫికేట్లను అందజేసారు.

పేదల పాలిట సీ ఎం కేసీఆర్ ఆపద్బందు!
ధర్మపురి నియోజకవర్గం లో ₹ 59 లక్షల 24 వేల 500 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 193 మంది లబ్ధిదారులకు చెక్కుల ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….
వివిధ కారణాల వల్ల అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్నటువంటి లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని,

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేదలకు నాణ్యమైన వైద్యమందించి ఆదుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పాలిట ఆపద్బాంధవుడు అని మంత్రి అన్నారు.
ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం ధర్మపురి నియోజక వర్గ పరిధిలోని ధర్మపురి, వెల్గటూర్, బుగ్గరాం, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మారం మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు శుక్రవారం ధర్మ పురి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.
వీరిలో ధర్మపురి మండలంలో 45 మందికి 14 లక్షల 47 వేల 500 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది.
వెల్గటూరు మండలంలో 21 మందికి 6 లక్షల 89 వేలు, బుగ్గారం మండలంలో 25 మందికి 7లక్షల 67 వేల రూపాయలు,
పెగడపల్లి మండలంలో 27 మందికి 4 లక్షల 55వేల 500 రూపాయలు,
గొల్లపల్లి మండలంలో 24 మందికి 6 లక్షల 96 వేల రూపాయలు,
ధర్మారం మండలంలో 51 మందికి 18లక్షల69 వేల ఐదు వందల రూపాయలు చెక్కులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ, జెడ్పీటీసీలు బత్తిని అరుణ, సుధారాణి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.