సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం లో సర్కార్ బడులకి మహర్దశ- ఎమ్మెల్యే సంజయ్ కుమార్!

J.SURENDER KUMAR,

సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సర్కార్ బడులకు మహర్దశ పట్టింది అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం లో భాగంగా ₹20 లక్షల 81 వేలతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన యువకుడు అజయ్ పాఠశాల విద్యార్థుల కోసం లక్ష రూపాయలు ఎమ్మెల్యే ద్వారా అందజేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ…..


👉 రాష్ట్ర ప్రభుత్వం విద్య వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా రాష్ట్రంలో విద్య వ్యవస్థ లో మంచి ఫలితాలు.
👉 రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు పెరిగిన విద్యార్థుల వలసలు 2022 -23 విద్య సంవత్సరంలో లక్ష విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు.
👉 సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యా విధానం, ఇంగ్లీష్ మీడియం లో బోధన, సన్నబియ్యం తో మధ్యాహ్న భోజనం, మన ఊరు మనబడి కార్యక్రమాల వల్ల విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి.
👉 దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన రాష్ట్రం తెలంగాణ.
👉 రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలో 6 లక్షల మంది విద్యార్థులు కార్పోరేట్ స్థాయి విద్యను అభ్యసిస్తున్నారు.
👉 గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థి పై ఒక లక్ష 25 వేల రూపాయల ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
👉 మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ₹7200 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
👉 రాష్ట్రంలో 26,800 ప్రభుత్వ పాఠశాలలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
👉 దళిత గిరిజన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి 20 లక్షలు విదేశీ ఓవర్సీస్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.


👉 రాష్ట్ర ఏర్పాటుకు ముందు 132 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే రాష్ట్ర ఏర్పాటు తర్వాత 104 పాఠశాలను స్వల్ప కాలంలోనే ప్రారంభించుకోవడం జరిగింది అని అన్నారు.
👉 రాష్ట్ర ఏర్పాటుకు ముందు 19 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే నేడు 207 పాఠశాలను ప్రారంభించుకోవడం జరిగింది…
👉 రాష్ట్రంలో జరిగే అన్ని విద్య ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుంది.
👉 స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే
👉 తెలంగాణ ఏర్పడినాటికి మూడు మెడికల్ కళాశాలలో ఉంటే నేడు 26 మెడికల్ కళాశాలలు ఉన్నాయి.
👉 జగిత్యాల నియోజకవర్గములో ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఇప్పటి వరకు 6 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం జరిగింది.
👉 బీర్ పూర్ మండలానికి ప్రాథమిక చికిత్స కేంద్రం మంజూరు చేయటం జరిగింది.అత్యాధునిక 108 అంబులెన్స్ సైతం మంజూరు చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పాత పద్మ కేడిసిసి జిల్లా సభ్యులు ముప్పాల రామచందర్ రావు, సర్పంచ్ గుడిసె శ్రీమతి ఎంపీటీసీ ఆడెపు మల్లేశ్వరి ఎస్ఎంసి చైర్మన్ఆడెపు సునీత, జిల్లా రైతు బందు సమితి సభ్యులు కొలుముల రమణ,మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, మాజీ మండల అధ్యక్షులు ముక్క వెంకటేష్ యాదవ్, సర్పంచుల ఫోరం అధ్యక్షలు మహిపాల్ రెడ్డి, రైతు బందు మండల కన్వీనర్ రాజేశం,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం రమేష్, తదితరులు పాల్గొన్నారు.