సీఎం కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ ఆవిర్భవించింది – మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J. SURENDER KUMAR,

రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణగా ఆవిర్భవించినవి మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ధర్మపురి పట్టణ కేంద్రంలో ఎస్.హెచ్ గార్డెన్ లో వైద్య ఆరోగ్య దినోత్సవం ముఖ్య అతిథిగా మంత్రి ఈశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……

ప్రజలందరికీ వైద్య, విద్య అందుబాటులో ఉన్నప్పుడే ప్రతి పల్లె మూల అభివృద్ధి సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. గ్రామీణ, బస్తీ స్థాయి నుండి తెలంగాణ వైద్య, విద్య రంగంలో విప్లవాత్మకమైన దిశలో దూసుకు పోతున్నది.
దేశంలోనే తెలంగాణ రాష్ర్టం వైద్యఆరోగ్య రంగంలో అత్యుత్తమమైన సేవలు అందిస్తున్న అగ్రగామిగా నిలిచింది.
సిఎం కెసిఆర్ గారు తీసుకుంటున్న చర్యలు వల్ల ప్రజల జీవితాలు బాగు పడుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారు
60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అతి తక్కువ సమయంలో 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించింది, అంతేగాక ఇటీవల ఏకకాలంలో 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియమించడం వల్ల టీచింగ్ ఆసుపత్రులు మరింత బలోపేతమై అయ్యాయి.
జగిత్యాల జిల్లాలో వైద్య ప్రమాణాలను మరింత పెంపొందించేందుకు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అందుబాటులోకి వచ్చాయి.


జిల్లాలో 36 వేల 516 మంది మహిళలకు కేసీఆర్‌ కిట్లను 35 కోట్ల 5 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం జరిగింది.
జిల్లా కేంద్రంలో 100 పడకల మాతా శిశు కేంద్రం ద్వారా అత్యుత్తమ ప్రసూతి సేవలు అందిస్తున్నాం.
ధర్మపురి పట్టణంలో 50 పడకల సామర్థ్యంతో మాతా శిశు కేంద్రాన్ని నిర్మిస్తున్నాం.
జిల్లా వ్యాప్తంగా 103 ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలకు 20 లక్షల వ్యయంతో నూతన భవనాల నిర్మాణం పనులు ప్రారంభించుకున్నాం. జగిత్యాల, ధర్మపురి, కోరుట్లలో కొత్త డయాలసిస్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.
ధర్మపురిలో రెండు, జగిత్యాలలో మరో బస్తీ దావఖానకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జిల్లాలో ఒక వ్యాప్తంగా 798 మంది పైలేరియా బాధితులకు ప్రతినెల 2 వేల 16 రూపాయల చెప్పున పెన్షన్ చెల్లించడం జరుగుతుంది.
ఇప్పటి వరకు జిల్లాలో 5 వేల 714 మంది మహిళలకు వైద్య పరీక్షలు చేసి, 308 మందికి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి పంపించడం జరిగింది, మొత్తంమ్మీద రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా వర్దిల్లు తుందని చెప్పుకోవచ్చు, ప్రభుత్వం చేస్తున్న కృషిలో మీరంతా భాగస్వామ్యులు అయినప్పుడు రాష్ట్రం మరింతగా అభివృద్ధి పదంలో దూసుకు పోతుంది అని మంత్రి అన్నారు.