దేవుడికి మొర పెట్టుకుంటున్న దేవస్థాన ఉద్యోగులు 3 నెలలుగా జీతాలు లేవు !

దాదాపు రెండు వేల మందికి పైగా ఉద్యోగుల ఆవేదన!

J.SURENDER KUMAR,

గత మూడు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నామని ఆలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2600 మంది ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రావలసిన నెల నెల జీతాలు రావడం లేదు. డిప్యూటీ కమిషనర్ హోదా గల కొండగట్టు, వేములవాడ, బాసర, భద్రాద్రి, యాదాద్రి, భద్రకాళి తదితర (D.C) ఆలయాల ఉద్యోగులకు జీతాలు నెలనెలా వస్తున్నాయి.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాలకు జీతాలు రావడం లేదు. ఆలయాల్లో విధులు నిర్వహించే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్వీపర్లు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కు ఆలయ అకౌంట్ నుంచి జీతాలు చెల్లిస్తున్నారు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతాలు పొందుటకు అర్హత కలిగిన ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. ఫైనాన్స్ శాఖలో సాంకేతిక లోపంతో జీతాలు ఆయా ట్రెజరీలకు ట్రాన్స్ఫర్ కావడం లేదు అనే సమాధానం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గత కొన్ని నెలలు వివరిస్తున్నారని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పందించి అధికారులను జీతాలు విడుదల చేయాల్సిందిగా ఆదేశించాల్సిందిగా ఆలయ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు కోరుతున్నారు.