J. SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో సమర్థవంతంగా విధులు నిర్వహించి, బదిలీ పై వెళ్తున్న CI బిల్లా కోటేశ్వర్, SI ఏలూరి కిరణ్ కుమార్ లను శుక్రవారం ధర్మపురి ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కర్నే అక్క పెళ్లి కళ్యాణమంటపంలో జరిగిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు సిఐఎస్ఐ కు అందించిన సేవలను, పాత్రికేయులతో ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రవర్తించిన తీరును ప్రసంగాల్లో వివరించారు.