ధర్మపురిలో మంత్రి ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ముందు వడ్లు పోసి రైతు నిరసన!

తరుగు ప్రశ్నిస్తే పరేషాన్ చేస్తున్నారని ఆవేదన!

J. SURENDER KUMAR,

ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం గేటు ముందు శనివారం రైతు రాజన్న వడ్లు పోసి నిరసన వ్యక్తం చేశాడు.
వివరాలు ఇలా ఉన్నాయి

ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సట్టం శెట్టి రాజన్న, అనే రైతు తాను పండించిన వరి ధాన్యం విక్రయించడానికి గ్రామంలోని కొనుగోలు కేంద్రం కు (IKP) తరలించాడు. కొనుగోలుదారులు బస్తా ఒక్కంటికి తరుగు పేరిట మూడు కిలోల వడ్లు అదనంగా తూకం వేస్తూ కొనుగోలు చేస్తున్నారు.
రాత్రి పగలు ఎండ వానలో కష్టపడుతూ మా రక్తంలో చెమటగా మారుస్తూ పండించిన మా ధాన్యం తరుగు పేరిట ఎలా అదనంగా తూకం వేసుకుంటారని రైతు రాజన్న, ధాన్యం కొనుగోలుదారులను ప్రశ్నించినట్లు వివరించారు.

రైతు రాజన్న

తరుగు పేరిట తమను ప్రశ్నించడంతో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు గత నెల రోజులుగా తాను తెచ్చిన ధాన్యం తూకం వేయక తనను పరేషాన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు మూడు సార్లు వర్షం పడి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిచిపోయింది అని తిరిగి ధాన్యాన్ని ఆర పోసి ఎండబెట్టిన నిర్వాహకులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కొనుగోలు కేంద్ర నిర్వాహకుల, రైస్ మిల్లర్ల అవినీతి, అక్రమాలు బయట పెట్టేందుకే మంత్రి క్యాంపు కార్యాలయం ముందు వడ్లు పోసి నిరసన వ్యక్తం చేస్తున్నాను అని రాజన్న అంటున్నాడు. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కొమ్ముకై రైస్ మిల్లుకు లారీల ద్వారా చేరిన ధాన్యమును, మిల్లర్లు కొంతమంది రైతులకు ఫోన్లు చేస్తూ తేమశాతం అధికంగా ఉంది. మరో రెండు కిలోల తరుగు తీస్తాం, లేదంటే మీ దాన్నే మీరు తీసుకెళ్లండి అంటూ చెప్పడంతో విధి లేని పరిస్థితిలో మరో రెండు కిలోల తరుగుకు కూడా రైతులు అంగీకరిస్తున్నట్టు, కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు క్యాంపు కార్యాలయం ముందు ధాన్యమును పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో కూడా ధాన్యం కొనుగోలు చేయకుండా వేధించినందుకు రైతు రాజన్న సింగిల్ విండో కార్యాలయం ముందు వరి ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేయడంతో ధాన్యము కొనుగోలు చేశారు.

బస్తా ఒక్కంటికి 3 కిలోల తరుగు లెక్కించిన.38 వేల బస్తాలకు ఎంత ?
రైతాంగం కథనం మేరకు!

కమలాపూర్ లో ధాన్యం కొనుగోలు గతంలో IKP మహిళా సంఘాలు కొనుగోలు చేసినప్పుడు. బస్తా ఒక్కంటికి 40 కిలోల, 600 గ్రాములు తూకం వేసే వారిని, 600 గ్రాములు. గోనెసంచి బరువు అని రైతాంగం వివరిస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు 43 కిలోలు తూకం వేస్తూ, 40 కిలోల ధాన్యం కు డబ్బులు చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమలాపూర్ లో ఏప్రిల్ చివరి వారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. శుక్రవారం నాటి వరకు 38 వేల 879 బస్తాల వరి ధాన్యం నియోజకవర్గంలోని వెలుగటూర్, ధర్మపురి, తదితర ప్రాంతాల రైస్ మిల్లులకు నిర్వాహకులు తరలించారు. శనివారం నాటికి కొనుగోలు కేంద్రంలో 3 వేల 558 బస్తాల ధాన్యం రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. బస్తా ఒక్కంటికి 3 కిలోల తరుగు పేరిట నిర్వాహకులు అధికంగా తూకం వేసి ఉండి ఉంటే. 38,879 బస్తాల కు తరుగు పేరిట ఎన్ని కిలోల ధాన్యం అధికంగా తూకం వేసి ఉంటారనే చర్చ కొనసాగుతున్నది.