మున్సిపల్ కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్లు.!
J.SURENDER KUMAR,
తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న తమను పోలీసుల తో నిర్బంధాలకు గురి చేయడం ప్రజాస్వామ్య పాలనా ? లేక ఇది దొరల పాలనా ? అంటూ మంగళవారం ధర్మపురి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఫోర్ లీడర్ వేముల నాగలక్ష్మి, మహిళ కౌన్సిలర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో తాగునీటి ధర్మపురి లో మిషన్ భగీరథ నీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఇట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ టౌన్ మహిళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ధర్మపురిలో కాంగ్రెస్ నేతలను, ముందస్తు తీసుకోవడంతో పాటు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ను కరీంనగర్ లో ఆయన ఇంటిలో పోలీసులు తీసుకుని కొడిమ్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ శ్రేణులు చాకచక్యంగా ధర్మపురి గోదావరి నది నుండి నీటిని తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కడిగి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.
ధర్మపురి ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి నిరసన తెలియజేయాలని అనుకుంటే పోలీసుల తో కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ధర్మపురిలో ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదని, కేవలం దొరల పాలన మాత్రమే నడుస్తుందని, గత నాలుగు సంవత్సరాలుగా ధర్మపురి ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని, ఆమె ఆరోపించారు. పక్కనే గోదావరి ఉన్నప్పటికీ ధర్మపురి ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా అధికారులకు మహిళలు పడుతున్న ఇబ్బంది గుర్తించి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈ విధంగా గోదావరి నీటితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కడిగి నిరసన వ్యక్తం చేసినట్టు ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగనబట్ల సంతోషి , జక్కు పద్మ , కౌన్సిలర్ గరిగె అరుణ, మహిళా నాయకులు ఆశెట్టి మమత శ్రీనివాస్, చిట్టనోజు స్వప్న రమేష్, బొల్లారపు భూలక్ష్మి, బొల్లారపు సుకన్య, ధర్మపురి టౌన్ అధ్యక్షులు అప్పం తిరుపతి, ఆశెట్టి శ్రీనివాస్, పురుషోత్తం, ప్రశాంత్, భరత్, దూడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
నిరసన వ్యక్తం చేస్తామంటే నిర్బంధిస్తారా ?
పోలీస్ స్టేషన్లో ఉంచుతారా !
సంగనబట్ల దినేష్

ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిరసనకు పిలుపు నిస్తే పోలీసుల తో కాంగ్రెస్ శ్రేణులను నిర్బంధిస్తారా? గంటల తరబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తారా అంటూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ధర్మపురి ప్రజలు తాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి పలు మార్లు తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని, తాగు నీటి కోసం ధర్మపురి ప్రజానీకం ఇన్ని అవస్థలు పడుతుంటే అధికార పార్టీ నాయకులు దశాబ్ది ఉత్సవాలు అంటూ సంబరాలు చేసుకుంటున్నారని, అదే విధంగా విద్యుత్ సరఫరా విషయంలో కూడా తరచూ మరమ్మత్తుల పేరిట కోతలు విధిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకొవడం లేదని వెంటనే ఇట్టి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు.!

ధర్మపురిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న లక్ష్మణ్ కుమార్ ను కరీంనగర్ లో ఆయన నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి కొడిమ్యాల స్టేషన్ కి తరలించారు..
పక్కనే గోదావరి నది ఉన్న ధర్మపురి ప్రజలు తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతుంటే మంత్రి కొప్పుల ఈశ్వర్ మాత్రం దశాబ్ది ఉత్సవాలు అంటు ర్యాలీలు తీసుకుంటు డిజే లు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారని, డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్యే గా, విప్ గా, మంత్రిగా ఉండి కూడా ధర్మపురి ప్రజానీకానికి నీటి సౌకర్యం కూడా కల్పించడం లేదనీ, మరో వైపు వడ్లను కూడ కొనుగోలు చెయ్యక ఇప్పటికీ ఐకెపి సెంటర్ల వద్ద ధాన్యాన్ని పెట్టుకొని రైతులు ఎదురుచూస్తున్నారని, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వీటికి మేము నిరసన తెలియజేయాలని అనుకుంటే పోలీసులను పెట్టీ ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ఆరోపించారు.