J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ రికార్డ్ స్థాయిలో ఆదాయం ₹ 60 లక్షల,96 వేల 35 రూపాయలు వచ్చింది.
శుక్రవారం దేవాలయ ఆవరణలో బందోబస్తు మధ్య సిబ్బంది, అధికారులు స్వచ్ఛంద సంస్థలు లెక్కించారు. మిశ్రమ బంగారము 53 గ్రాములు, మిశ్రమ వెండి 9 కిలోల 850 గ్రాములు మరియు విదేశి నోట్లు ( 52 ) వచ్చినట్టు కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
మార్చి 24 నుంచి 30-06-2023 వరకు నిండిన హుండీ లోనీ కానుకలు లెక్కించగా గతంలో ఎప్పుడు రాని విధముగా ఆదాయం వచ్చినట్టు వారు ప్రకటనలో పేర్కొన్నారు.

హుండీ లెక్కింపు సమయంలో ఎ.చంద్రశేఖర్, సహాయ కమీషనర్, కరీంనగర్ . దేవస్థాన రెనవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామన్న సభ్యులు శ్రీమతి గందె పద్మ శ్రీనివాస్, అక్కెనపెల్లి సురేంధర్, వేరవేని కొమురయ్య, చుక్క రవి, స్థంభంకాడి మహేష్, శ్రీమతి ఇనగంటి రమ వెంకటేశ్వర్ రావు, గునిశెట్టి రవీందర్, పల్లెర్ల సురేందర్, గుంపుల రమేష్, వేముల నరేష్, సంగెం సురేష్ , దేవస్థాన సూపరింటెండెంట్ డి.కిరణ్, ఉప ప్రధాన అర్చకులు నేరళ్ళ శ్రీనివాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్, మరియు తిరుమల సేవా గ్రూప్ సభ్యులు, కరీంనగర్ మరియు ధర్మపురి, లక్షేటిపేట సేవకులు, ఇతరులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు దేవస్థాన అర్చకులు & సిబ్బంది, భక్తులు తదితరు పాల్గోన్నారు.
