ధర్మపురి పట్టణ బంద్ విజయవంతం – పట్టుబడిన పశువులను ఆసిఫాబాద్ గోశాలకు !

తరలించిన ధర్మపురి పోలీసులు…


J.SURENDER KUMAR,


ధర్మపురి లో ఎద్దులను వధించిన ఘటనను నిరసిస్తూ శుక్రవారం హిందూ ఐక్యవేదిక ఇచ్చిన బంద్ పిలుపు మేరకు వ్యాపారస్తు లు స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో ధర్మపురి పట్టణ బంద్ విజయవంతమైనది. గురువారం బజరంగ్దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ధర్మపురికి రావడంతో పోలీసుల అధీనంలో ఉన్న దాదాపు 50 పశువులను పోలీసులు గురువారం రాత్రి హుటా హుటినా ఆసిఫాబాద్ గోశాలకు తరలించారు.

పట్టణ బంద్ చేయిస్తున్నారు అనే అనుమానంతో పలువురు బిజెపి కార్యకర్తలు పోలీసులు అదుపులో తీసుకున్నారు. బిజెపి జాతీయ నాయకుడు సారంగుల అమర్నాథ్ , పోలీసు ఉన్నతాధికారుల కు ఫోన్ చేసి మా కార్యకర్తలను ఏ కారణంతో అదుపులో తీసుకున్నారని నిలదీయడంతో సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన వారిని పోలీసులు సాయంత్రం విడిచిపెట్టారు.


దాదాపు 50 పశువులు గోశాలకు..


స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న దాదాపు 50 కి పైగా పశువులను ఆసిఫాబాద్ గోశాలకు గురువారం రాత్రి పోలీసులు తరలించారు.
గత నెల 26 న రాయపట్నం చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తున్న ధర్మపురి పోలీసులకు నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. కౌటాల నుండి జగిత్యాల జిల్లా చిల్వాకోడూరుకు , రంగారెడ్డి జిల్లాకు మరి కొన్ని పశువులను వాహనంలో తరలిస్తున్నారని పోలీసులు వివరించారు. వాహనాలతో పాటు పశువులను తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి ధర్మపురి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత నాలుగు రోజులుగా పశువులు, వాహనాలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాయి. ఈ సమాచారం తెలిసింది బజరంగ్దళ్ నాయకులు,మరో న్యాయవాది, ధర్మపురికి చేరుకొని పోలీసులను మీరు పట్టుకున్న పశువులను పోలీస్ స్టేషన్ లో ఎలా నిర్బంధిస్తారు ? న్యాయస్థానాల ఉత్తర్వుల మేరకు వాటిని వెంటనే గోశాలకు తరలించాలి అంటూ పోలీస్ అధికారులను ప్రశ్నించారు.

బక్రీద్ పండుగ తర్వాత తరలించాలి అనుకున్నామని పోలీసులు వారికి వివరించినట్టు సమాచారం.
ఇది ఇలా ఉండగా ప్రశ్నించిన వారిని పోలీసులు అరెస్టు చేయడం, బెదిరించిన వారిపై కేసులో నమోదు చేయకపోవడం, ఏమిటని ? అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. రామ సుధాకర్ రావు. ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్ సందర్భంగా పోలీసులు ధర్మపురి పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటన జరగకుండా చర్యలు చేపట్టారు.