J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ శ్రీ శ్రీ శ్రీ మాదవానంద సరస్వతి స్వామి ( తొగుట ఆశ్రమం) స్వామీజీ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామీజీ కాలభైరవుడి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.

స్వామివారికి వేదమంత్రాలతో ఘన స్వాగతం!
శ్రీ మాధవానంద స్వామికి, వేద పండితులు, మహిళలు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు మంగళ హారతులతో స్థానిక ఇసుక స్తంభం నుండి ఆలయ గోపురం వరకు ఘనంగా స్వాగతం పలికారు.

సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో మేళతాళాలతో ఆలయ అర్చకులు వేద పండితులు ఉద్యోగులు స్వామివారికి ఆలయంలో స్వాగతం పలికారు.

దర్శనం అనంతరం దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ , స్వామీజీకి శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం అందజేసి సన్మానించారు. అనంతరం స్వామి వారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ సంభాషణ చేశారు.
పుస్తకావిష్కరణ…
‘శ్రీ ధర్మపురి క్షేత్ర మాహాత్మ్యం’

బ్రహ్మశ్రీ కశొజ్జల సదాశివ శాస్త్రి సంస్కృతంలో వ్రాసిన అట్టి గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా తెలుగు లిపిలో తాత్పర్యంతో సహా అందరికీ అర్థమయ్యే రీతిలో కశొజ్జల రాజేశ్వర శర్మ రూపకల్పన చేసిన గ్రంథాన్ని రంగంపేట (తొగుట) ఆశ్రమం శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి గారు బుధవారం ఆవిష్కరించారు.
ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు ముత్యాల శర్మ పాలెపు ప్రవీణ్ కుమార్ , ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు ,

ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు,రమణయ్య రెనవేషన్ కమిటి సభ్యులు వేముల నరేష్ , సంగెం సురేష్ , గునిశెట్టి రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ అర్చకులు చక్రపాణి కిరణ్ కుమార్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు