ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో..
రేపు ఆధ్యాత్మిక దినోత్సవ సంబరాలు!

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా..


J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవములలో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవము సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానములో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవములలో భాగంగా బుధవారం రోజున ఆధాత్మిక దినోత్సవము సందర్భముగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన లో తెలిపారు.

👉 అనుబంధ దేవాలయములలో ఉదయం 6-00 గంటల నుండి 8-00 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికై ప్రధాన దేవాలయముతో పాటు అనుబంద ఆలయముల “అభిషేకములు, విశేష పూజల” నిర్వహణ

👉 ఉదయం 8-00 గంటల నుండి 9-00 వరకు “వేదపారాయణం” నిర్వహణ.


👉 ఉదయం 10-00 గంటల నుండి 11-00గంటల వరకు “సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతములు” నిర్వహణ – మంత్రి ఈశ్వర్ దంపతులు పాల్గొననున్నారు.


👉 ఉదయం 8-00 గంటల నుండి 9-00 వరకు “వేదపారాయణం” నిర్వహణ.


👉 ఉదయం నుండి మధ్యాహ్నం వరకు “ఉచిత ప్రసాదం” వివరణ.


👉 మధ్యాహ్నం 1-00 నుండి 2-30 వరకు “చిందుయక్షగాన” కార్యక్రమము 8) సాయంత్రం 4-00 గంటల నుండి 5-30గంటల వరకు “సామూహిక విష్ణున హస్రనామ పారాయణం.


👉 సాయంత్రం 6-00 గంటల నుండి 7-30 గంటల వరకు “కూచిపూడి / భరత నాట్య ప్రదర్శన” కార్యక్రమము.


👉 అనుబంధ దేవాలయములకు “ప్రత్యేక పూలదండలతో అలంకరణ” చేయుట.


👉 దేవాలయమునకు మరియు రాజగోపురములకు “విద్యుత్ దీపాలంకరణ” ఏర్పాట్లు,


👉 ధర్మపురి నియోజక వర్గం లో మంజూరు కాబడిన 24 దేవాలయములకు చెందిన అర్చకులకు మంత్రి ఉదయం 11.00గంటలకు ప్రొసీడింగ్స్ ఉత్తర్వులను అందించనున్నారు.

ఈ ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా స్థానిక మంత్రి కొప్పుల ఈశ్వర్ , పార్లమెంటు సభ్యులు జిల్లా పరిషత్ చైర్మెన్ , మరియు జిల్లా కలెక్టరు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ప్రకటనలో పేర్కొన్నారు