మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J.SURENDER KUMAR,
2018 ధర్మపురి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణలు అవాస్తవం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం అడ్వకేట్ కమిషన్ ముందు హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ తనపై చేస్తున్నా ఆరోపణలు ఖండిస్తూ మంత్రి ఈశ్వర్ శుక్రవారం వీడియో విడుదల చేశారు.
హై కోర్టులో విచారణ జరుగుతుండగా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు విషయం కోర్టు పరిధిలో ఉన్నా కూడా లక్ష్మణ్ ఆరోపణలు చేస్తున్నారు.
ఎలాంటి కంప్లైట్ ఇవ్వకుండానే లక్ష్మణ్ రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు
కౌంటింగ్ లో ఏదో తేడా ఉందని లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు ఏదో రాజకీయ సింపథీ కోసం లక్ష్మణ్ ప్రయత్నిస్తున్నాడు
ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు ఉంటే నిర్భ్యంతరంగా ఇవ్వొచ్చు నోరు ఉంది కదా అని ఏదీ పడితే అది మాట్లాడడం సరికాదు
కనీస అవగాహన లేకుండా లక్ష్మణ్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడు
ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయంగా లబ్దిపొందేందుకే లక్ష్మణ్ ఆరోపణలు రిటర్నింగ్ అధికారి నా గెలుపును ప్రకటించినప్పుడు సంతకం పెట్టింది నీవు కాదా ? అడ్లూరి లక్ష్మణ్ అంతా అబద్దాలకోరు మరొకరు ఉండరు
ధర్మపురి ఎన్నిక అంశం కోర్టు పరిధిలో ఉన్నది.
ప్రజలను తప్పుదొవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలి.ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది.
ఎక్కడ తేడా వచ్చిందో ఆధారాలతో నిరూపించాలి. ఏవైనా అనుమానాలు ఉంటే ఎన్నికల కమిషన్, అధికారులతో తెల్చుకోవాలి.
పదే పదే తనపై పొంతన లేని విమర్శలు మాను కోవాలి. ప్రస్తుతం ధర్మపురి ఎన్నిక అంశం కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టు పరిధిలో అంశం గురించి ఎవరూ మాట్లాడటం సరి కాదు.
మంత్రి గా ప్రభుత్వంలో కొనసాగుతూ. కోర్టు అడిగిన వివరాలను తెలియ చేశాను.
ఇక స్ట్రాంగ్ రూమ్ తాళలు కూడా ఎన్నికల అధికారుల పరిధిలో ఉంటుంది.
ఎన్నిక జరిగిన నాటి నుంచి ఈవియం భద్రపరిచిన దగ్గర కు తాను వెళ్ళలేదు.
కౌంటింగ్ కేంద్రం లోకి కూడా వెళ్ళలేదు.
తాను ప్రభుత్వంలో కొనసాగుతూ రీ కౌంటింగ్ చేయమని ఎలా కోరుతాను అంటూ వీడియోలు ప్రసంగించారు.