దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా దశాబ్ది దగా నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి!

డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్!


J.SURENDER KUMAR,

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా దశాబ్ది దగా అనే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ శ్రేణులను కోరారు.
ఈ సందర్భంగా ఆయన బుధవారం ధర్మపురి తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

మీడియా సమావేశ ముఖ్యాంశాలు..


👉 గురువారం ఉదయం 9 గంటలకు నంది విగ్రహం నుండి గాంధీ విగ్రహం మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది..
👉 తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తుంది..
👉 ఆరుగారం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కేంద్రాల వద్ద రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే దశాబ్ది ఉత్సవాల పేరిట సంబరాలు చేసుకుంటున్నారు..
👉 మిల్లర్లు కటింగ్ పేరిట రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కనీసం స్పందించరు..
👉 మిల్లర్లు కటింగ్ పేరిట రైతుల దగ్గర నుండి దోచుకున్న మొత్తాన్ని తిరిగి రైతులకు ఇప్పించగలిగే దమ్ము మంత్రి ఉందా ?
👉 తలాపున గోదావరి ఉండి ధర్మపురి ప్రజానీకానికి తాగడానికి నీళ్ళు అందకున్నా, విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాటి గురించి మంత్రి పట్టించుకోరు..
👉 ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విషం చిమ్ముతూ, జీవన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలను చేస్తున్నారు..
👉 ఎమ్మెల్యే గా,విప్ గా,మంత్రి గా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ తన గుండె మీద చెయ్యి వేసుకొని ధర్మపురి అభివృద్ధికి ఎం చేశారో చెప్పాలి..
👉జీవన్ రెడ్డి ని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన మంత్రి సవాల్ కి సిద్ధమని, తేదీ సమయాన్ని ,చెప్పాలని జీవన్ రెడ్డి అంటే మంత్రి ఎందుకని స్పందించడం లేదు
👉 వరదలకు రోల్లవాగు కట్టతేగి రైతులు నష్టపోతే వారికి ఇప్పటి వరకు ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వలేదు..
👉 బి.ఆర్.ఎస్ నాయకుల రోల్ల వాగు పర్యటన కేవలం విహార యాత్ర లాగా మాత్రమే కనిపిస్తుంది..
👉 60 కోట్ల అంచనా వ్యయం తో మొదలు పెట్టిన రోల్లవారు ప్రాజెక్ట్ ₹130 కోట్ల వ్యయం కి ఎలా పెరిగింది. అందులో మంత్రి కొప్పుల ఈశ్వర్ వాట ఎంత.?
👉మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దమ్ము ధైర్యం ఉంటే ఇథనాల్ ప్రాజెక్టు గురించి ఐదు గ్రామల ప్రజలతో సభను నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టాలి. అంటూ లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగన బట్ల దినేష్, బ్లాక్ కాంగ్రెస్ 1అద్యక్షులు కుంట సుధాకర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహారాజు ప్రసాద్, మండల యూత్ అధ్యక్షులు రాందెని మొగిలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, కస్తూరి శ్రీనివాస్, సీపతి సత్యనారయణ, రఫియొద్దిన్, సుముక్, అశెట్టి శ్రీనివాస్, స్తంభం కాడి గణేష్, అయ్యోరీ మహేష్, అప్పం తిరుపతి, అప్పం శ్రవణ్ , శ్రీహరి యూత్ సభ్యులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.