ఎమ్మెల్యే సంజయ్ కుమార్
J.SURENDER KUMAR,
రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం ధూప దీప నైవేద్య ఆలయ అర్చకులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉత్తర్వులు అందజేశారు.
సారంగాపూర్ మండల పెంబట్ల కోనాపుర్ శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ధూప దీప నైవేద్యం లో భాగంగా జగిత్యాల నియోజకవర్గం లోని 16 ఆలయాలను ఎంపిక చేయగా ఆలయాల అర్చకులకు ప్రొసీడింగ్స్ ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున శ్రీనివాస్, జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, పాక్స్ ఛైర్మెన్ మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్,మండల పార్టీ నాయకులు,అర్చకులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
మసీదు చర్చిలో ప్రార్థన లు

ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణము లోని మజీద్, చర్చిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, సదర్ మున్ను, మైనార్టీ నాయకులు హుస్సేన్, బాబా, సోహేల్, ముజాహిద్, రషీద్, నయీం, ఖలీద్, కలీల్, జలీల్, శంశేర్ మున్సిపల్ కమి షనర్ సంతోష్, కౌన్సిలర్ మ హేందర్,తదితరులు పాపాల్గొన్నార
బీఆర్ఎస్ లో చేరికలు

రాయికల్ మండల ధర్మాజిపేట్ గ్రామనికి చెందిన కాంగ్రెస్ నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేముల నర్సయ్య కనికరపు రాజేందర్. పోతు నర్సయ్య. శనిగరపు సుమన్. మామిడిపల్లి గంగరాజాం మరియు వారి అనుచరులు 20 మంది కండువా కప్పుకున్నా రు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్, ధర్మాజిపేట్ సర్పంచ్ స్నేహహరీష్, ఉపసర్పంచ్, మండలం యూత్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు సురేందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.