డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో నూతనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహానికి లక్ష్మణ్ కుమార్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవం లాంటి అంబేద్కర్ లాంటి వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ పైన ఉందని అన్నారు. ధర్మపురి లో ఉన్న దళితులకు ఎటువంటి కష్టం వచ్చిన ముందుండి నిలబడే రాజమల్లయ్య తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని అనుకున్నామని, కానీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేవలం వారి పార్టీకి సంబందించిన నాయకులను మాత్రమే పక్కన పెట్టుకొని విగ్రహావిష్కరణ చెయ్యడం చాలా బాధాకరమని, అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయింది అంటే అది కేవలం అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లనేనని, అంబెడ్కర్ గారి కార్యక్రమంలో వారి పాటలు పెట్టాలి , తప్ప ఒక నాయకుని పాటలు పెట్టి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, మంత్రి ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మహనీయుడు అంబెడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం తప్ప మరో ఉద్దేశం ఏమి లేదని, త్వరలోనే బాబు జగ్జివన్ రావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి స్థానిక దళిత పెద్దలతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని లక్ష్మణ్ కుమార్ తెలిపారు..
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగన బట్ల దినేష్, బ్లాక్ కాంగ్రెస్ 1ఎంపిటిసి కుంట సుధాకర్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, దళిత సంఘాల పెద్దలు రాజమల్లయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, మండల ఎం.అర్.పి.ఎస్ అధ్యక్షులు రవి, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పురుషోత్తం, టౌన్ యూత్ అధ్యక్షులు అప్పం తిరుపతి, మండల బి. సి సెల్ అధ్యక్షులు మల్లేష్, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోచయ్య , కట్ట భువనేశ్వర్, మల్లేష్, శ్రవణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..